అకీరా నందన్ టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎంతైనా పవర్ స్టార్ తనయుడు కదా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

అకీరా నందన్ టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎంతైనా పవర్ స్టార్ తనయుడు కదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో వైరల్ అవుతున్నాడు. మామూలుగా అకీరా సోషల్ మీడియాకు, సెన్సేషనల్ టాపిక్స్‌కు దూరంగా ఉంటాడు. తండ్రిలాగే ఆర్భాటాలు, అట్టహాసాలంటే నప్పవు. అలాంటి అకీరా నందన్.. నిహారిక పెళ్లిలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అకీరా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడే హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ వచ్చేశాయని కామెంట్లు చేయసాగారు. అలా అకీరా నందన్ అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. […]

 Authored By uday | The Telugu News | Updated on :20 December 2020,10:04 am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో వైరల్ అవుతున్నాడు. మామూలుగా అకీరా సోషల్ మీడియాకు, సెన్సేషనల్ టాపిక్స్‌కు దూరంగా ఉంటాడు. తండ్రిలాగే ఆర్భాటాలు, అట్టహాసాలంటే నప్పవు. అలాంటి అకీరా నందన్.. నిహారిక పెళ్లిలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అకీరా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడే హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ వచ్చేశాయని కామెంట్లు చేయసాగారు.

Renu Desai shares Akira nandan playing piano

Renu Desai shares Akira nandan playing piano

అలా అకీరా నందన్ అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరి కంటే అకీరా నందనే ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అకీరా మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు మొదులుతుంటాయట. ఒకసారి స్పోర్ట్స్ అంటాడు.. మరోసారి జాబ్ అంటాడు.. ఇంకోసారి సినిమాలంటాడు.. అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది ఆ మధ్య. అయితే అకీరాలో కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

అకీరా నందన్ బాస్కెట్ బాల్ ఆడటంలో ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటాడు. పైగా పియానో వాయించడంలోనూ స్పెషలిస్ట్. తాజాగా అకీరా పియానే వాయిస్తుంటే.. రేణూ దేశాయ్ టీ తాగుతూ అలా గాల్లో విహరిస్తోన్నట్టుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల 36 నిమిషాలకు అంటూ టైం చెబుతూ.. ఓ వైపు ఓట్ మిల్క్ టీ.. మరో వైపు అకీరా పియానో వాయిస్తున్నాడు..చిన్ని ఆనందం.. ఈ చిన్ని జీవితంలో అని రేణూ దేశాయ్ ఉప్పొంగిపోయింది. అయితే అకీరా వాయించిన ఈ మ్యూజిక్ వింటే ఎవ్వరైనా మైమరిచిపోవాల్సిందే.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది