Republic : మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ గత కొంతకాలంగా సక్సస్ లకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరసగా ఫ్లాప్స్ వస్తుండటంతో కాస్త గ్యాప్ తీసుకున్న సాయి ధరం తేజ్ తనకి ఎలాంటి కథలు సూటవుతాయో ఎనలైజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చిత్రలహరి, ప్రతీరోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. దాంతో సక్సస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరం తేజ్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. కానీ సాయి ధరం తేజ్ మాత్రం అన్నీ కథలను ఒప్పుకోవడం లేదు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే పొల్టికల్ థ్రిల్లర్ సినిమా చేసేందుకు ఒకే అన్నాడు. ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ తో అలాగే ఇదే సినిమాని బాలీవుడ్ లో సంజయ్ దత్ తో చేసి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు దేవాకట్ట దర్శకత్వంలో “రిపబ్లిక్” సినిమాని చేస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇంతక ముందే ఈ సినిమా నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
కాగా ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితం టీజర్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్‌ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేయడం విశేషం. ఇక రిలీజ్ చేసిన టీజర్‌లో ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం”.. అన్న డైలాగ్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మేకర్స్ హింట్ ఇచ్చారు. కాగా ఈ తాజా టీజర్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను ఆజట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.