Republic : రిపబ్లిక్ టీజర్ రిలీజ్.. పొల్టికల్ థ్రిల్లర్ తో మెగా హీరో..!

0
Advertisement

Republic : మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ గత కొంతకాలంగా సక్సస్ లకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరసగా ఫ్లాప్స్ వస్తుండటంతో కాస్త గ్యాప్ తీసుకున్న సాయి ధరం తేజ్ తనకి ఎలాంటి కథలు సూటవుతాయో ఎనలైజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చిత్రలహరి, ప్రతీరోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. దాంతో సక్సస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరం తేజ్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. కానీ సాయి ధరం తేజ్ మాత్రం అన్నీ కథలను ఒప్పుకోవడం లేదు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

republic-teaser release mega hero with poltical thrillar movie
republic-teaser release mega hero with poltical thrillar movie

ఈ క్రమంలోనే పొల్టికల్ థ్రిల్లర్ సినిమా చేసేందుకు ఒకే అన్నాడు. ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ తో అలాగే ఇదే సినిమాని బాలీవుడ్ లో సంజయ్ దత్ తో చేసి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు దేవాకట్ట దర్శకత్వంలో “రిపబ్లిక్” సినిమాని చేస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇంతక ముందే ఈ సినిమా నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

Republic : ఒక్క డైలాగ్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మేకర్స్ హింట్ ఇచ్చారు.

కాగా ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితం టీజర్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్‌ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేయడం విశేషం. ఇక రిలీజ్ చేసిన టీజర్‌లో ” ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం”.. అన్న డైలాగ్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మేకర్స్ హింట్ ఇచ్చారు. కాగా ఈ తాజా టీజర్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను ఆజట్టుకుంటూ ట్రెండ్ అవుతోంది.

 

Advertisement