Child Artist Revanth : జనసేన కోసం వెంకీ కొడుకు ప్రచారం.. ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేశాడా..!
ప్రధానాంశాలు:
Child Artist Revanth: జనసేన కోసం వెంకీ కొడుకు ప్రచారం..ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేశాడా..!
Child Artist Revanth: రేవంత్ భీమల … తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ బుడ్డోడు చేస్తున్న హంగామా మాములుగా లేదు. విక్టరీ వెంకటేష్ Venkatesh కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన హ్యాట్రిక్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ Sankranthiki Vasthunam విడుదల తర్వాత రేవంత్ పాపులర్ అయ్యాడు. ఆడియన్స్ అందరూ అతని నటన గురించి గొప్పగా చెబుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్లిరాజు పాత్ర ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ కారెక్టర్ గురించి టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ పాత్రను థియేటర్లో చూసి జనాలు నవ్వుకోవాలని Anil Ravipudi అనిల్ రావిపూడి అలా దాచి పెట్టి ఉండొచ్చు.

Child Artist Revanth: జనసేన కోసం వెంకీ కొడుకు ప్రచారం..ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేశాడా..!
Child Artist Revanth: బుడ్డోడు గట్టోడు..
అయితే అనిల్ రావిపూడి Anil Ravipudi ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ కారెక్టర్‌ను జనాలు థియేటర్లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని బుల్లిరాజు తన భుజాన మోశాడు. ఒక్క సినిమాతోనే బుల్లి రాజుకి స్టార్డం వచ్చేసింది. వేలెడంత లేదు ఇంత టాలెంట్ ఎలా ఈ కుర్రాడికి అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ప్రత్యేకించి రేవంత్ Revanthని అభినందించారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. బుల్లి రాజు క్యారక్టర్ ని మెచ్చుకున్నాడు. అయితే బుల్లి రాజు అలియాస్ రేవంత్ మామూలోడు కాదు. ఈ బుడ్డోడు గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ఇంటిని తిరిగి ప్రచారం చేశాడు. దానికి సంబంధించిన వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ చేసి బాగా వైరల్ చేసారు.
అయితే సినిమాలో తనకి అవకాశం ఎలా వచ్చిందో చెప్పాడు Revanth రేవంత్.ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ TDP గుర్తు సైకిల్, జనసేన పార్టీ Janasena గుర్తు గాజు గ్లాసుకు ఓటు వేయమని ఇంటింటికీ తిరుగుతూ రేవంత్ భీమల ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో ఆ వీడియో షేర్ చేశాడు. అయితే… ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది.నేను పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారికి వీరాభిమానిని..ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అనిల్ రావిపూడి గారు ఆ వీడియో ని చూసి బాగా నచ్చి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
నేను జనసేన పార్టీకి క్యాంపెయిన్ చేసిన వీడియో చూసి నాకు ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చారు..- సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ రేవంత్(బుల్లి రాజు)#SankranthikiVasthunnam #BulliRaju #PawanKalyan #JanasenaParty #AnilRavipudi #NTVTelugu pic.twitter.com/9QN4MBZWAY
— NTV Telugu (@NtvTeluguLive) January 18, 2025