JR NTR : ఎట్టకేలకు ఎన్.టి.ఆర్ 30 సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఆచార్య తప్ప కొరటాల శివ కెరీర్‌లో ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఒక్కటి కూడా లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆచార్య కూడా ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌తో గనక తెరకెక్కించి ఉంటే మరో హిట్ తన ఖాతాలో వేసుకునేవారు. కానీ, ఆచార్య సినిమాలో మెగాస్టార్ ఎక్కువగా ఇన్‌వాల్వ్ కావడం వల్లే డిజాస్టర్‌గా నిలిచిందని టాక్ ఉంది. ఇక ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తిగా ఎన్.టి.ఆర్ 30 సినిమా మీద దృష్ఠిపెట్టారు కొరటాల.
ఈ నెల 20న ఎన్.టి.ఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించబోతున్న రెండు భారీ చిత్రాలకు సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఎన్.టి.ఆర్ 30 చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ 31ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే, తాజాగా ఎన్.టి.ఆర్ 30 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. దీనిలోనే రేపు రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ఎన్.టి.ఆర్ 30కి సంబంధించిన హీరోయిన్‌తో పాటు మిగతా టెక్నికల్ టీమ్ వివరాలను..షూటింగ్ అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నారు.
ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ తాజాగా ఎన్.టి.ఆర్ 30 నుంచి ఫస్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో తారక్ ఓ కత్తిని పట్టుకొని నిలుచున్నాడు. వర్షంలో భారీ యాక్షన్ సీన్‌కు సంబంధించినది అని అర్థమవుతోంది. అంతేకాదు. హీరోతో కత్తిపట్టించడం కొరటాలకు బాగా కలిసి వచ్చిన అంశం. మిర్చి సినిమాలో ప్రభాస్‌తో కొడవలి పట్టించాడు. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలోనూ మెగాస్టార్‌తో కత్తి పట్టించారు. ఇదే పోస్టర్‌ను ఆచార్య సినిమా నుంచి మొదటి పోస్టర్‌గా వదిలారు. ఇప్పుడు ఎన్.టి.ఆర్‌తోనూ కత్తి పట్టించారు కొరటాల. ఈ ఒక్క పోస్టర్‌తోనే ఎన్.టి.ఆర్ 30 ఏ రేంజ్ రివేంజ్ డ్రామానో అర్థమవుతోంది. చూడాలి మరి ఈ మూవీకి సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ రేపు ఏమేమి రాబోతున్నాయో.
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…
Rohit Sharma : మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు…
Womens : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…
Pan Card : గుర్తింపుకు ప్రాథమిక రుజువుగా పనిచేసే ఆధార్ కార్డ్ మాదిరిగానే బహుళ వ్యాపారం మరియు పన్ను అవసరాలకు…
This website uses cookies.