JR NTR : రివేంజ్ డ్రామాను పాన్ ఇండియన్ లెవల్‌లో..జూనియర్ ఎన్టీఆర్‌తోనూ కత్తిపట్టించిన కొరటాల శివ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR : రివేంజ్ డ్రామాను పాన్ ఇండియన్ లెవల్‌లో..జూనియర్ ఎన్టీఆర్‌తోనూ కత్తిపట్టించిన కొరటాల శివ

 Authored By govind | The Telugu News | Updated on :20 May 2022,8:20 am

JR NTR : ఎట్టకేలకు ఎన్.టి.ఆర్ 30 సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఆచార్య తప్ప కొరటాల శివ కెరీర్‌లో ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఒక్కటి కూడా లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆచార్య కూడా ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌తో గనక తెరకెక్కించి ఉంటే మరో హిట్ తన ఖాతాలో వేసుకునేవారు. కానీ, ఆచార్య సినిమాలో మెగాస్టార్ ఎక్కువగా ఇన్‌వాల్వ్ కావడం వల్లే డిజాస్టర్‌గా నిలిచిందని టాక్ ఉంది. ఇక ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తిగా ఎన్.టి.ఆర్ 30 సినిమా మీద దృష్ఠిపెట్టారు కొరటాల.

ఈ నెల 20న ఎన్.టి.ఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించబోతున్న రెండు భారీ చిత్రాలకు సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఎన్.టి.ఆర్ 30 చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ 31ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే, తాజాగా ఎన్.టి.ఆర్ 30 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. దీనిలోనే రేపు రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ఎన్.టి.ఆర్ 30కి సంబంధించిన హీరోయిన్‌తో పాటు మిగతా టెక్నికల్ టీమ్ వివరాలను..షూటింగ్ అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నారు.

Revenge drama on Pan Indian level JR NTR Movie

Revenge drama on Pan Indian level JR NTR Movie

NTR 30 : సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ రేపు ఏమేమి రాబోతున్నాయో.

ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ తాజాగా ఎన్.టి.ఆర్ 30 నుంచి ఫస్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో తారక్ ఓ కత్తిని పట్టుకొని నిలుచున్నాడు. వర్షంలో భారీ యాక్షన్ సీన్‌కు సంబంధించినది అని అర్థమవుతోంది. అంతేకాదు. హీరోతో కత్తిపట్టించడం కొరటాలకు బాగా కలిసి వచ్చిన అంశం. మిర్చి సినిమాలో ప్రభాస్‌తో కొడవలి పట్టించాడు. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలోనూ మెగాస్టార్‌తో కత్తి పట్టించారు. ఇదే పోస్టర్‌ను ఆచార్య సినిమా నుంచి మొదటి పోస్టర్‌గా వదిలారు. ఇప్పుడు ఎన్.టి.ఆర్‌తోనూ కత్తి పట్టించారు కొరటాల. ఈ ఒక్క పోస్టర్‌తోనే ఎన్.టి.ఆర్ 30 ఏ రేంజ్ రివేంజ్ డ్రామానో అర్థమవుతోంది. చూడాలి మరి ఈ మూవీకి సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ రేపు ఏమేమి రాబోతున్నాయో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది