Shekar Movie Review : యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ ఒకప్పుడు ఎన్ని సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్నాళ్ల గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాజశేఖర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు ఈ యాంగ్రీమ్యాన్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. రీసెంట్‌గా శేఖర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ: శేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్…క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్ కేసులు చేధించడంలో నిపుణుడు. నేరస్తులు ఎవరైనా ఇట్టే కనిపెట్టే అంత టాలెంట్ ఉన్న మాస్టర్, అతని నైపుణ్యాన్ని ఉపయోగించి, పోలీసు అధికారులు డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి అతని సహాయం తీసుకుంటారు. ఒకరోజు ఇందుకు యాక్సిడెంట్ అవుతుంది.. దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో ఆమె చనిపోతుంది. ఆమెచావు మీద అనుమానంతో వెంటనే శేఖర్ తన తన ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తాడు. తన భార్య యాక్సిడెంట్‌తో చనిపోలేదని,ఎవరో హత్య చేశారని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరకు భార్యను హత్య చేసింది ఎవరు? అతను కేసును పరిష్కరిస్తాడా? ఇందు అతని నుండి ఎందుకు విడిపోయింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల విషయానికి వస్తే.. డా.రాజశేఖర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి చూపించాడు. అచ్చం పోలీసు ఆఫీసర్ లా అదరగొట్టారు.కాని ఈ పాత్రకు కావల్సిన యాక్టీవ్ నెస్ అతనిలో మిస్ అయినట్టు స్పస్టంగా కనిపిస్తుంది. ఇక ఆయన భార్యగా నటించిన మలయాళ నటి ఆత్మీయ రాజన్ మొదటి సారి తెలుగు సినిమాలో చేసినా కూడా అద్భుతంగా నటించింది. ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర ఇలా ఎవరికి వారు తమ పరిధిమేరకు బాగానే నటించారు.
శేఖర్ సినిమా ఓపెనింగ్ బాగానే ఉంటుంది. పెద్దగా సమయం తీసుకోకుండా కథ ని చెప్పే ప్రయత్నం చేశారు.. కాని సినిమాలోకి వెళ్లే కొద్ది.. ఆడియన్స్ ను కదలకుండా చేయడంలో.. టీమ్ ఎక్కడో రాంగ్ స్టెప్ వేసినట్టు తెలుస్తోంది. సినిమాలో కొన్ని ట్విస్ట్‌లు మరియు మలుపులు ఉన్నాకూడా కానీ అవి కథలో సరిగ్గా ఇమడలేదు, శేఖర్ పాత్రలో రాజశేఖర్ ఓకే, కానీ దర్యాప్తు చేసేటప్పుడు అతను శారీరకంగా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాపై కాస్త ఫోకస్ పెడితే బాగుంటుందని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
రాజశేఖర్
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
రొటీన్ సీన్స్
బోరింగ్ సన్నివేశాలు
స్లో నరేషన్
ఇన్వెస్టిగేటివ్ సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. ఈసినిమా జోసెఫ్ అనే మలయాళ సూపర్‌హిట్ సినిమాకు రీమేక్. ఈ విషయం మూవీ టీమ్ ఎక్కడా చెప్పలేదు కాని.. ఈసినిమా మాలయాళంలో హిట్ అయినంతగా తెలుగులో వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మన నెటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడంతో టీమ్ జాగ్రత్త పాటించలేనట్టు తెలుస్తోంది.
Ghee In Winter : చలికాలంలో మనం చలిని నుండి రక్షణ పొందడానికి వెచ్చగా ఉండేందుకు మందటి దుస్తులు ధరిస్తూ…
Zodiac Signs : 2025లో గ్రహాల మార్పులు అన్ని రాశుల వారి జీవితంలోని ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం…
Viral Video : పుష్ప్ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఈ…
Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల పరంగా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు కానీ అమ్మడు ఫోటో…
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో…
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
This website uses cookies.