Home » Entertainment » Rishab Shetty Love Story So Many Twists
Entertainment

Rishab Shetty : సినిమాని మించిన ట్విస్ట్‌ల‌తో కాంతారా డైరెక్ట‌ర్ ల‌వ్ స్టోరీ

Authored By
Sam C
The Telugu News | Published on: October 21, 2022, 2:30 pm
Advertisement

Rishab Shetty : ఇప్పుడు ఎక్క‌డ చూసిన కాంతార మూవీ గురించే చ‌ర్చ‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది.హిందీలో సైతం ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. తన కుటుంబసభ్యులతో కలిసి ఇప్పుడే సినిమా చూశానని… ఇప్పటికీ తన శరీరం వణుకుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. జానపద కథలు, సంప్రదాయాలు, దేశీయ సమస్యల కలయికే ఈ సినిమా అని ఆమె ప్ర‌శంస‌లు కురిపించింది.

Advertisement

కాంతార మూవీ 100 కోట్ల వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ కి ఈ చిత్రం కాసుల పంట పండిస్తోంది. గతవారం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయగా, అన్ని భాషాల్లో కాంతార సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతీ సినీ లవర్ నోటి నుంచి వస్తున్న సినిమా పేరు కాంతార. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత, నేషనల్ వైడ్‌గా సెన్షేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార కాగా, ఈ సినిమా హీరో,ద‌ర్శ‌కుడు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. ఈయ‌న ల‌వ్ స్టోరీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Rishab Shetty love story so many twists

Advertisement

Rishab Shetty : ఇది అస‌లు సంగ‌తి..

రక్షిత్ శెట్టికి వీరాభిమాని అయిన ప్రగతి, ఓఈవెంట్‌కు వెళ్ళిందట. అప్పుడే ప్రగతిని రిషబ్ శెట్టి చూశాడట. ఆ టైమ్‌లో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందే అని ఆలోచిస్తూ, ఆ ఈవెంట్ అయ్యాక ఇంటికి వెళ్ళాడట రిషబ్ శెట్టి. ఇక ఇంటికి వెళ్ళగానే తన ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయగా, ఈవెంట్‌లో కనిపించిన అమ్మాయి సెండ్ చేసిన ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపిండంతో వెంటనే యాక్సెప్ట్ చేశాడట రిషబ్ శెట్టి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, తర్వాత పెళ్ళి వరకు వెళ్ళడం జరపోయింది. 2020లో రిషబ్, ప్రగతిలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఐటీ జాబ్‌కు గుడ్ బై చెప్పేసిన ప్రగతి, భర్త రిషబ్‌కు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి