Getup Srinu : గెటప్ శ్రీను హీరోగా సినిమా.. హీరోయిన్ తో ఏకంగా లిప్ లాకే.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 16 January 2023, 10:20 am

Getup Srinu : గెటప్ శ్రీను తెలుసు కదా. జబర్దస్త్ ద్వారా శ్రీను లైమ్ లైట్ లోకి వచ్చాడు. జబర్దస్త్ ద్వారా ఏకంగా సెలబ్రిటీ అయిపోయాడు. ఒక కమెడియన్ స్థాయి నుంచి ఇప్పుడు పవర్ ఫుల్ నటుడిగా మారాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చాలా పాత్రల్లో నటించాడు గెటప్ శ్రీను. ఇప్పుడు ఏకంగా హీరోగా నటిస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా పేరు రాజు యాదవ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే పూర్తి చేసుకుంటున్నాయి.

ఈ సినిమా సూడో హీరోయిజం జానర్ లో వస్తోంది. ఈ సినిమాకు కృష్ణమాచారి డైరెక్టర్. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ అదుర్స్ అని టీజర్ చూస్తూనే తెలుస్తుంది. ఈ సినిమాలో అన్ని యాంగిల్స్ ఉంటాయి. లవ్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే.. ఈ టీజర్ లో గెటప్ శీను ఏకంగా హీరోయిన్ కు లిప్ లాక్ పెట్టేశాడు.

getup srinu as hero in raju yadav movie teaser released

getup srinu as hero in raju yadav movie teaser released

Getup Srinu : హీరోయిన్ తో లిప్ లాక్ అనేసరికి ఎగబడి మరీ టీజర్ చూస్తున్న కుర్రాళ్లు

టీజర్ లో హీరోయిన్ తో గెటప్ శ్రీను తన పెదవిని కలిపేశాడు. దీంతో ఆ టీజర్ ను చూసి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. గెటప్ శ్రీనులో ఉండే మరో నటుడిని ఈ సినిమా ద్వారా వెలికి తీస్తున్నాం అని మూవీ యూనిట్ చెప్పింది. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి నిర్మాత. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి