Home » Entertainment » Rocket Raghava Sensational Comments On Anasuya Leaving Jabardasth
Entertainment

Rocket Raghava : ఎవరు వచ్చినా, వెళ్లినా జబర్దస్త్ ఆగదు..అనసూయ వెళ్లడంపై రాకెట్ రాఘవ సెన్సేషనల్ కామెంట్స్

Authored By
aruna
The Telugu News | Published on: July 24, 2022, 3:30 pm
Advertisement

Rocket Raghava : జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతోన్న సంగతి తెలిసిందే. నితిన్ భరత్, నాగబాబు వంటి వారు వెళ్లిపోవడంతో వారితో పాటు కొంత మంది బయటకు వచ్చారు. అయితే ఈ మధ్య గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అనసూయ వంటి వారు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇందులో ఒక్క అనసూయ మాత్రమే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే అందులో జబర్దస్త్ నుంచి బయటకు వెళ్తున్నాను అని ప్రకటించేలేదు. కానీ జీవితంలో ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది.

Advertisement

అది జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడమే అని అందరికీ అర్థమైంది. ఇక అనసూయ తాజాగా చివరి ప్రోమోలో కనిపించింది. అదే తనకు జబర్దస్త్ షోలో చివరి ఎపిసోడ్ అని చెప్పేశారు. దీంతో అనసూయ మీద సెటైర్లు పడ్డాయి. ఎమోషనల్ డైలాగ్స్ కూడా వేశారు. అయితే రాకెట్ రాఘవ కావాలని అలా అన్నాడా? లేదా అనసూయ మీద సెటైరికల్‌గా అన్నాడా? అనేది అర్థం కావడం లేదు. చలాకీ చంటి తన స్కిట్లో భాగంగానే అనసూయకు ఇక చివరి రోజు అంటూ కౌంటర్లు వేశాడు. మళ్లీ అనసూయ మీద వెంకీ మంకీ టీం స్కిట్ వేసింది.

Rocket Raghava Sensational Comments on Anasuya Leaving Jabardasth

Advertisement

పిల్లల్ని ఇంట్లో వదిలేసి, తల్లికి ఇచ్చి మరీ జబర్దస్త్ షోకు వచ్చారు కదా? నాటి సంగతులను గుర్తు చేశారు. అయితే అనసూయ మాత్రం జబర్దస్త్ నుంచివెళ్లిపోయేందుకు నిర్ణయించుకుందన్న సంగతి తెలిసిందే.నెలలో మూడు రోజులు కూడా నీకు టైం దొరకదా? అని చలాకీ చంటి ఎమోషనల్ అవుతాడు. ఇంద్రజ సైతం అనసూయ వీడ్కోలు విషయంపై కన్నీరు పెట్టేస్తుంది. ఈ సమయంలోనే రాఘవ కొన్ని మాటలు అనేస్తాడు. ఎవరు వచ్చినా వెళ్లినా జబర్దస్త్ ఇలానే ఉంటుందని అనేశాడు.

ఇంకా కొత్త వారు వస్తుంటారు.. మేం కొత్తగా మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాం.. మాకు మీ సపోర్ట్ కావాలి అంటూ ఆడియెన్స్‌కు రాకెట్ రాఘవ విన్నపించుకున్నాడు. మొత్తానికి అనసూయ మాత్రం ఇకపై జబర్దస్త్ షోలో కనిపించదు. ఆమె స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి