Home » Devotional » Horoscope August 2022 Check Your Zodiac Signs Gemini
Devotional

Zodiac Signs : మిథున రాశి వారికి, ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
aruna
The Telugu News | Published on: July 24, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : ఆగష్టు నెల, 2022, మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో ఈ రాశిలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీకు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ మాసంలో మిథున రాశి వారికి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే 21వ తారీకు తరువాత ఆస్తులను అమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త ఆస్తులను కొనగలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కని భవిష్యత్తు ఉంది. రైతులకు పంట విషయంలో చక్కగా ఉంది. ఫైనాన్స్ విషయంలో అనుకూలంగా ఉంది. ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న రుణాల లోన్స్ ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు రానున్నాయి. ఇలాంటి వారు రోజు సూర్య భగవానుడిని పూజించాలి. గర్భవతులు, సినిమా రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది.

horoscope august 2022 check your zodiac signs Gemini

Advertisement

రుణ సంబంధిత విషయాల్లో చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం రానుంది. లా రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ వారు వేరే ప్రాంతాలకు బదిలీ అవుతారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటారు. భూముల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే నిత్యం నిద్రలేవగానే గణపతిని ధ్యానించాలి. అలాగే గణపతి స్తోత్రాలను చదవాలి. నవగ్రహాలలో కేతువు గ్రహానికి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి