Srikanth : హీరో శ్రీకాంత్ కోసం పోట్లాట.. ఇంద్రజ, రోజాలది మరీ దారుణం!
Srikanth బుల్లితెరపై ఇప్పుడు రోజా, ఇంద్రజల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. రోజాకు ఆ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో జబర్దస్త్ జడ్జ్‌గా ఎంతో మంది వచ్చారు వెళ్లారు. కానీ ఇంద్రజ మాత్రం అలా ఫిక్స్ అయిపోయింది. ఎంతలా అంటే.. ఇక రోజానే అవసరం లేదు అనేంతగా ఫేమస్ అయిపోయింది.
Roja And Indraja Fight For Hero Srikanth
హీరో శ్రీకాంత్ కోసం పోట్లాట.. ఇంద్రజ, రోజాలది మరీ దారుణం! Srikanth
అలా మళ్లీ రోజా ఎంట్రీ ఇచ్చినా కూడా జనాలు మాత్రం ఇంద్రజనే కోరుకున్నారు. నెటిజన్ల డిమాండ్ మేరకు ఇంద్రజను శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో తీసుకున్నారు. మొత్తానికి అలా ఇంద్రజ, రోజాలను మల్లెమాల బ్యాలెన్స్ చేసింది. అయితే ఈ వినాయకచవితికి మాత్రం ఇంద్రజ, రోజాల మధ్య పొగబెట్టేలా ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. తాజాగా వదిలిన ప్రోమోలో ఈ ఇద్దరూ రచ్చ చేశారు.
Roja And Indraja Fight For Hero Srikanth
ఊరిలో వినాయకుడు అనే ఈవెంట్‌కు శ్రీకాంత్ గెస్టుగా వచ్చారు. ఇక ఏ వైపు ఉండాలో తేల్చుకోలేకపోయిన శ్రీకాంత్‌ను రోజా, ఇంద్రజ ఇద్దరూ పట్టి లాగేశారు. రోజా వైపు కాస్త బలం ఎక్కువ ఉండటంతో శ్రీకాంత్‌ను లాగేశారు. అయితే ఇంద్రజ మాత్రం గాలమేయాలని చూసింది. నా మొదటి సినిమా హీరో కదా? అంటూ కాకపట్టే ప్రయత్నం చేసింది. కానీ రోజా మాత్రం ఆ పప్పులేమీ ఉడకనివ్వలేదు. ఏంటి ఫస్ట్ అంటూ ఇంద్రజ మీదకు వెళ్లేసింది.
