Bhola Shankar Movie : భోళా శంకర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా ..!

Authored By aruna | The Telugu News | Published on: August 12, 2023, 11:00 am

Bhola Shankar Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ భోళా శంకర్ ‘ సినిమాపై మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ అంటేనే మండిపడే రోజా చిరంజీవి భోళాశంకర్ సినిమాను చూశారు. మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేసుకోలేరు అని కామెంట్స్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేరే సినిమాకి రీమేక్ గా తీశారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమాను చిరంజీవి చేసి హిట్టు కొట్టడంలో వింత ఏముంది అని రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే తమిళంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం సినిమాకి రీమేక్ గా భోళా శంకర్ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే రోజా ఆల్రెడీ హిట్ అయిన సినిమాను రీమేక్ చేసి హిట్టుకొట్టడంలో ఆయన గొప్ప ఏముంది అని చిరంజీవిపై రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో మెగా అభిమానులు రోజాపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించింది.

Roja Comments On Chiranjeevi After Watching Bhola Shankar Movie

Roja Comments On Chiranjeevi After Watching Bhola Shankar Movie

ప్రస్తుతం వీకెండ్ డేస్ కాబట్టి ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా నష్టపోయే అవకాశం ఉండదు. బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుందని తెలుస్తుంది. గతంలో చిరంజీవి చేసినవన్నీ రీమేక్ సినిమాలే. వాటి ద్వారానే ఆయన మెగాస్టార్ గా ఎదిగారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో రీమేక్ సినిమాలు గురించి పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా వేరే భాషలో సినిమాలు కూడా చూస్తున్నారు. దీంతో రీమేక్ సినిమాలను ఈజీగా కనిపెట్టేస్తున్నారు.

https://youtu.be/gfGyoz23CnI

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp