Roja : వారంలోనే సెట్ చేసేశావా?.. సుధీర్ పరువుతీసిన రోజా

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 17 October 2021, 8:52 am

Roja  బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. కామెడీ, ఎమోషన్, డ్యాన్స్, మ్యాజిక్, అడ్వెంచరస్, హోస్టింగ్ ఇలా ప్రతీ ఒక్కటీ సుధీర్ తన స్టైల్లో చేసి మెప్పిస్తాడు. అయితే సుధీర్‌ను అందరూ కూడా అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. అలాంటి స్కిట్లు, స్క్రిప్ట్‌లే ఎక్కువగా రాసుకుంటారు. చివరకు అందరూ కూడా అది నిజమేనేమో అని భ్రమపడేస్తుంటారు. కానీ అది కేవలం స్కిట్ వరకే ఉంటుంది.

Roja Counters On Sudheer In Extra Jabardasth

Roja Counters On Sudheer In Extra Jabardasth

తాజాగా రోజా ఓ కామెంట్ వేసింది. సుధీర్ దెబ్బకు షాక్ అయ్యాడు. మామూలుగా ఈ మధ్య లేడీ గెటప్పులు తగ్గిపోయాయి. లేడీ కేరక్టర్ ఆర్టిస్ట్‌లను పట్టుకొస్తున్నారు. సీరియల్‌లో తారామణులను తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు. అలా ఇప్పటికే వర్ష, షబినా వంటి వారు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. తాజాగా ఓ కొత్త లేడీ ఆర్టిస్ట్ వచ్చింది. ఆమె ఇప్పుడు కార్తీక్ టీంలో ఉంది.

Roja  సుధీర్ రొమాన్స్‌పై రోజా కామెంట్

Roja Counters On Sudheer In Extra Jabardasth

Roja Counters On Sudheer In Extra Jabardasth

కార్తీక్ టీంలో సుధీర్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినట్టున్నాడు. ఆ కొత్త అమ్మాయితో సుధీర్ ట్రాక్ వేసేసినట్టు అనిపిస్తోంది. వచ్చి వారమే అయింది.. అప్పుడే సెట్ చేసేశావా? అని సుధీర్ పరువుతీసింది రోజా. అయ్యో మేడం నేనేం చేయలేదు అంటూ సుధీర్ కంగారు పడిపోయాడు. ఆ ఒక్క డైలాగే చెప్పాడా? అంటూ రోజా గాలి తీసేసింది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి