Roja Daughter : రోజా కూతురా, మ‌జాకానా.. ర్యాంప్ వాక్‌తో అద‌ర‌గొట్టేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja Daughter : రోజా కూతురా, మ‌జాకానా.. ర్యాంప్ వాక్‌తో అద‌ర‌గొట్టేసిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Roja Daughter : రోజా కూతురా, మ‌జాకానా.. ర్యాంప్ వాక్‌తో అద‌ర‌గొట్టేసిందిగా..!

Roja Daughter : తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించి, ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోజా సెల్వమణి. సినిమాలకు దూరమైనా, ఆమె రాజకీయ వ్యూహాలు, పంచ్ డైలాగులు ఇప్పటికీ పెద్ద చర్చలకే దారితీయడం తెలిసిందే. ఇప్పుడు ఆమె కూతురు అన్షు రెడ్డి కూడా అంతే హైలైట్ అవుతోంది.

Roja Daughter రోజా కూతురా మ‌జాకానా ర్యాంప్ వాక్‌తో అద‌ర‌గొట్టేసిందిగా

Roja Daughter : రోజా కూతురా, మ‌జాకానా.. ర్యాంప్ వాక్‌తో అద‌ర‌గొట్టేసిందిగా..!

Roja Daughter  : ఏమందం ఇది..

అన్షు రెడ్డి చిన్ననాటి నుంచే బహుముఖ ప్రతిభను కనబరిచింది. రచయిత్రిగా పుస్తకాలు రచించడం, పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడం వంటి విజయాలు ఆమె ఖాతాలో ఇప్పటికే ఉన్నాయి.తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో అన్షు రెడ్డి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరోయిన్‌ లా కనిపించిన అన్షు, తన ఆత్మవిశ్వాసంతో, లుక్‌తో, స్టైలిష్ ప్రెజెన్స్‌తో సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్స్.. ఇంత అందంగా ఉందేంటి! రోజా కూతురు అని కాదు.. నిజంగా స్టార్ మెటీరియల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు అన్షు సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి అధికారికంగా ఏ సమాచారం లేదు. కానీ ఆమెలో ఉన్న గ్లామర్, సాంగ్‌ ప్రెజెన్స్ చూసి పరిశ్రమ వర్గాలు మాత్రం “అన్షు హీరోయిన్‌గా వస్తే.. తక్కువ సమయంలో స్టార్ అవడం ఖాయం” అంటూ అంచనా వేస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది