Sudigali Sudheer : రెచ్చిపోయిన రోజా.. దండం పెట్టేసిన సుడిగాలి సుధీర్
Sudigali Sudheer : బుల్లితెరపై జబర్దస్త్, అందులో రోజా వేసే పంచుల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. స్కిట్లు చేసే ఆర్టిస్ట్‌లు, టీం లీడర్లను రోజా ఆడేసుకుంటుంది. వారు ఎంతో కష్టపడి చేసే స్కిట్లు, వేసే పంచ్‌లను రోజా ఇట్టే కని పెట్టేస్తుంది. వారి కంటే ముందే రోజా పంచ్‌లు వేసి వారి గాలిని తీసేస్తుంటుంది. అలా రోజా దెబ్బకు ఎక్కువగా సుధీర్ టీం బలవుతుంటుంది.
రాం ప్రసాద్ ఆటో పంచ్‌లను, సుధీర్ సెటైర్లను రోజా ముందుగానే కనిపెడుతుంటుంది. వచ్చే వారం అయితే రోజా గ్యాప్ లేకుండా సుధీర్‌ను ఆడుకుంది. సుధీర్, రాం ప్రసాద్ వేయాల్సిన వరుస పంచ్‌లను రోజా వేసేస్తుంటుంది. దీంతో సుధీర్ తల పట్టుకుంటాడు. రాం ప్రసాద్ అయితే దెబ్బకు షాక్ అవుతాడు. అన్నింటి కంటే ఎక్కువగా డీజే టీల్లుతో సుధీర్ వేసిన పంచ్ మీద రోజా కౌంటర్ వేస్తుంది.

Roja Punches To Sudigali Sudheer In Extra Jabardasth
Sudigali Sudheer : వరుస పంచ్‌లతో రోజా దాడి..
డీజే ఎక్కడ వాయిస్తారు అని సుధీర్ అనడం.. నీ చావుకు కూడా వాయిస్తాను అని డీజే టిల్లు హీరో అంటాడు. అయితే వాడి చావు కంటే ఎక్కువగా వాడు పోలీసులకు ఎప్పుడు దొరుకుతాడా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు అని రోజా కౌంటర్ వేస్తుంది. దీంతో రోజాకు సుధీర్ దండం పెట్టేస్తాడు. అలా రోజా దెబ్బకు సుధీర్ టీం గజగజ వణికిపోయినట్టు అయింది.
