Roja : ఈటీవీలో రోజా ఇంకా ఎన్ని వారాలు కనిపించబోతున్నారో తెలుసా?
Roja : ఈటీవీ జబర్దస్త్ లో తొమ్మిది సంవత్సరాల జర్నీ కి రోజా గుడ్ బై పలికింది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా అయిన సమయంలో కూడా ఆమె జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగిన విషయం తెలిసిందే. ఇటీవలే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెకి మంత్రి పదవికి అప్పగించడం జరిగింది. మంత్రి పదవి దక్కిన తర్వాత రోజా జబర్దస్త్ లో కొనసాగేది లేదని అధికారికంగా ప్రకటించింది. రోజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెల రోజులు కావస్తోంది. ఆయినా కూడా ఆమె జడ్జి గా వ్యవహరించిన జబర్దస్త్ ఎపిసోడ్ లు టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రోజా కు గుడ్ బై చెబుతూ సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఆ తర్వాత ఎపిసోడ్లో కూడా మళ్ళీ రోజా కనిపించారు. జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మంత్రి రోజా కనిపిస్తూనే ఉండడంతో జనాలకు అనుమానం కలుగుతోంది. రోజా జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది కానీ మనసు ఒప్పక ఆమె జబర్దస్త్ లో కంటిన్యూ అవ్వాలని ఉద్దేశంతో ఉన్నారా.. మళ్లీ మళ్లీ ఆమె ఎపిసోడ్లలో ఎలా కనిపిస్తూ ఉన్నాయి అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గత రెండు మూడు వారాలుగా టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ లు అన్ని కూడా గతంలో అంటే రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు షూటింగ్ చేసిన ఎపిసోడ్లు.. అవన్నీ ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నాయి.

Roja will be seen for how many more days in etv mallemala Jabardasth show
ఎక్స్ ట్రా జబర్దస్త్ సన్మాన కార్యక్రమం జరిగిన ఎపిసోడ్ ఆమెకు మంత్రి పదవి వచ్చిన తర్వాత చిత్రీకరించారు. ఇక జబర్దస్త్ లో వచ్చే వారం రాబోతున్న ఎపిసోడ్ ఆమెకు మంత్రి పదవి వచ్చిన తర్వాత చిత్రీకరించారు. గురువారంతో జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి పూర్తిగా కనిపించకుండా రోజా పోతున్నారు. ఆమె స్థానంలో ఎవరు రాబోతున్నారు అనే విషయమై క్లారిటీ రావడానికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ తదుపరి వారం కి సంబంధించిన జబర్దస్త్ ఎపిసోడ్ షూటింగ్ కార్యక్రమాలు జరిగి ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రోమోలు విడుదలైతే అప్పుడు జడ్జిగా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బుల్లితెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.