Shanmukh : షణ్ముఖ్ దీప్తి, సిరి శ్రీహన్.. జంటలు బ్రేకప్ అయ్యాయా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shanmukh : షణ్ముఖ్ దీప్తి, సిరి శ్రీహన్.. జంటలు బ్రేకప్ అయ్యాయా..?

shanmukh : బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట బాగా ఫేమస్ అవుతుండగా.. ఈసారి బాగా వైరల్ అయిన జంట మాత్రం సిరి షన్నుది. బయట నుంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్రమక్రమంగా బాగా క్లోజ్ అయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమంటూనే లవర్స్ మాదిరి రెచ్చిపోయారు. వారి బంధం ఏంటో హౌజ్ నుంచి బయటకు వచ్చిన సభ్యులకు అర్థం కాకపోగా.. బయట ప్రేక్షకులు కూడా జుట్టు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 December 2021,2:00 pm

shanmukh : బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట బాగా ఫేమస్ అవుతుండగా.. ఈసారి బాగా వైరల్ అయిన జంట మాత్రం సిరి షన్నుది. బయట నుంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్రమక్రమంగా బాగా క్లోజ్ అయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమంటూనే లవర్స్ మాదిరి రెచ్చిపోయారు. వారి బంధం ఏంటో హౌజ్ నుంచి బయటకు వచ్చిన సభ్యులకు అర్థం కాకపోగా.. బయట ప్రేక్షకులు కూడా జుట్టు పీక్కున్నారు. ముఖ్యంగా హౌజ్ లో వారి అసభ్యకర ప్రవర్తన చూసి బయట అభిమానులు ఘోరంగా ట్రోల్ చేశారు. ఇద్దరికీ బయట వేరువేరుగా జంటలున్న హౌజ్ లో వారి హగ్గులు, ముద్దులు ఎలా వైరల్ అయ్యాయో.. ఇంకా అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే బయట వీరిద్దరికీ వేరు వేరుగా పెయిర్స్ ఉన్నా.. హౌజ్ లో మాత్రం ప్రేమికులలా ప్రవర్తించారు.

అదే ఇప్పుడు వీరి కొంప ముంచినట్లు తెలుస్తోంది.టాప్ 5 కి వెళ్లి టైటిల్ కి కాస్తా దూరంలో ఆగిపోయి బయటకు వచ్చిన షణ్ముఖ్, సిరి హన్మంత్ లకు బయట పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నట్లు సమాచారం. ఇప్పటికే షన్ను ప్రియురాలు దీప్తి సునయన.. షన్ను తో మాట్లాడటం లేదని తెలుస్తోంది. అందుకు ఆమె పెట్టే ఇన్ డైరెక్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లే నిదర్శనం. ఇటీవల దీప్తి సునయన చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇంకేం మాట్లాడాలిరా.. మాట్లాడటానికి ఏమీ లేదు. అంత ఐపోయిందంటూ దీప్తి చేసిన కామెంట్ పరోక్షంగా షన్నునే అంటోందంటూ నెటిజన్లు భావిస్తున్నారు. హౌస్ లో ఆయన సిరితో కలసి ఉన్న పద్దతి నచ్చకనే దీప్తి ఆయనకు హ్యాండ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షో ప్రారంభం నుంచే షన్ను ప్రవర్తన పై గుర్రుగా ఉన్న దీప్తి సునయన..

roumars on shanmukh deepthi and siri srihan loves breakups

roumars on shanmukh deepthi and siri srihan loves breakups

shanmukh : సిరి శ్రీహన్ షణ్ముఖ్ దీప్తి జంటల బ్రేకప్ రూమర్స్..!

చివరి వరకు షన్ను ఓటింగ్ పై మాత్రం బయట నుంచి తెగ శ్రమించి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది.ఇక సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ చోటు విషయానికి వస్తే.. ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేసిన వీరిద్దరూ బిగ్ బాస్ లో సిరి వ్యవహారం చూసిన తర్వాతా ఆయన కూడా తెగ హార్ట్ అయినట్లు తెలుస్తుంది. నుండి వారి చిత్రాలన్నింటినీ తొలగించినట్లు నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. షణ్ముఖ్‌తో సిరి సంబంధంపై కలత చెందిన శ్రీహన్… హౌస్ నుంచి బయటకు వచ్చిన సిరిని ఇంతవరకు కలవలేదని సమాచారం. షన్ను, సిరి హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వారి వారి జంటలతో ఓ ఫోటో కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకోకపోవడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది