RRR Radhe Shyam : ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడనున్నాయా..?
కరోనా రెండో దశ అనంతరం ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లంతా ఈ మధ్యే తెరుచుకున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడ్డ భారీ సినిమాలన్నీ ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన చిన్న సినిమాలన్నీ థియేటర్స్‌లో సందడి చేశాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి సీజన్ రానే వచ్చింది. ఎన్నో సినిమాలు థియేటర్లకు క్యూ కడతాయి కాబట్టి సినీ ప్రేక్షకులకు ఇదే అసలైన పండుగగా చెప్పవచ్చు. వారి కోరుకున్నట్టుగానే భారీ సినిమాల విడుదల తేదీలను ప్రకటించేశారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల భీమ్ల నాయక్, సర్కారు వారి పాట వంటి చిత్రాలు పోస్ట్ పోన్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు దీంతో కొంత నిరాశకు లోనైనా ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాల పైన అయిన కొన్ని ఆశలు పెట్టుకున్నారు.
అయితే వారి ఆశలు కూడా ఆవిరి అయ్యేలా కనిపిస్తున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య కొన్ని నెలల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించడం వల్ల ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాని సహా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. అవేమీ పట్టనట్టుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఏపీలో కొన్ని థియేటర్లను సీజ్ చేయగా. టికెట్ ధరల రేట్ల తగ్గింపుతో.. కొన్ని థియేటర్లను యజమానులే స్వచ్చందంగా మూసివేశారు. ఇది పక్కా ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ మూవీల కలెక్షన్స్ పై గట్టి ప్రభావం చూపుతుంది. మరోవైపు రోజురోజుకు పెరిగిపోతోన్న కరోనా కేసుల దృష్ట్యా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రెండు చిత్రాలకు కూడా వాయిదా తప్పేలా కనిపించడం లేదు.

roumars spreading on RRR and Radhe Shyam movies postpone
RRR Radhe Shyam : ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ వాయిదా..!
ఓ వైపు భారీ కలెక్షన్లు సాధించి పెట్టే ఏపీ లో టికెట్ల రేట్లు తగ్గింపు వల్ల ఇప్పటికే నష్టాలకు భయపడుతున్న చిత్ర నిర్మాతలు, ఇక కరోనా మూడో వేవ్ వల్ల మొత్తానికే మోసం అవుతుందని ఇప్పుడు అయోమయంలో పడుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్న ప్రాంతాల్లో నైట్ షోలపై ప్రభావం పడుతుంది. మరో వైపు నిబంధనల దృష్ట్యా 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలి. ఇదే జరిగితే కలెక్షన్ల పరంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటే సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించిన ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలకి వాయిదా తప్పేలా కనిపించడం లేదు.