RRR Radhe Shyam : ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడనున్నాయా..?

కరోనా రెండో దశ అనంతరం ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా మూత పడిన థియేటర్లంతా ఈ మధ్యే తెరుచుకున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడ్డ భారీ సినిమాలన్నీ ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన చిన్న సినిమాలన్నీ థియేటర్స్‌లో సందడి చేశాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి సీజన్ రానే వచ్చింది. ఎన్నో సినిమాలు థియేటర్లకు క్యూ కడతాయి కాబట్టి సినీ ప్రేక్షకులకు ఇదే అసలైన పండుగగా చెప్పవచ్చు. వారి కోరుకున్నట్టుగానే భారీ సినిమాల విడుదల తేదీలను ప్రకటించేశారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల భీమ్ల నాయక్, సర్కారు వారి పాట వంటి చిత్రాలు పోస్ట్ పోన్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు దీంతో కొంత నిరాశకు లోనైనా ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాల పైన అయిన కొన్ని ఆశలు పెట్టుకున్నారు.

అయితే వారి ఆశలు కూడా ఆవిరి అయ్యేలా కనిపిస్తున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య కొన్ని నెలల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించడం వల్ల ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాని సహా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. అవేమీ పట్టనట్టుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఏపీలో కొన్ని థియేటర్లను సీజ్‌ చేయగా. టికెట్ ధరల రేట్ల తగ్గింపుతో.. కొన్ని థియేటర్లను యజమానులే స్వచ్చందంగా మూసివేశారు. ఇది పక్కా ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ మూవీల కలెక్షన్స్ పై గట్టి ప్రభావం చూపుతుంది. మరోవైపు రోజురోజుకు పెరిగిపోతోన్న కరోనా కేసుల దృష్ట్యా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రెండు చిత్రాలకు కూడా వాయిదా తప్పేలా కనిపించడం లేదు.

roumars spreading on RRR and Radhe Shyam movies postpone

RRR Radhe Shyam : ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ వాయిదా..!

ఓ వైపు భారీ కలెక్షన్లు సాధించి పెట్టే ఏపీ లో టికెట్ల రేట్లు తగ్గింపు వల్ల ఇప్పటికే నష్టాలకు భయపడుతున్న చిత్ర నిర్మాతలు, ఇక కరోనా మూడో వేవ్‌ వల్ల మొత్తానికే మోసం అవుతుందని ఇప్పుడు అయోమయంలో పడుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్న ప్రాంతాల్లో నైట్‌ షోలపై ప్రభావం పడుతుంది. మరో వైపు నిబంధనల దృష్ట్యా 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలి. ఇదే జరిగితే కలెక్షన్ల పరంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటే సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించిన ఆర్‌ ఆర్‌ ఆర్‌, రాధేశ్యామ్‌ సినిమాలకి వాయిదా తప్పేలా కనిపించడం లేదు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago