Home » Entertainment » Rrr Big Update From Rrr Rajamouli Interduced By Ntr Heroine Olivia Morris
Entertainment

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్ : ఎన్‌టిఆర్ హీరోయిన్ ని పరిచయం చేసిన రాజమౌళి ..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: January 29, 2021, 11:08 am
Advertisement

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్ ని తాజాగా ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి బృందం. రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగర్ ఎన్‌టిఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. కొమరం భీం పాత్రల్లో ఎన్‌టిఆర్ – చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. కరోనా కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను రాజమౌళి ఎలా ఎదుర్కోబోతున్నాడన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో నెలకొంది.

Advertisement

rrr big update from rrr rajamouli interduced by ntr heroine olivia morris

అందుకు రాజమౌళి సమాధానాలు ఇవ్వడం మొదలు పెట్టారు. సినిమాని ప్రమోట్ చేయడం లో రాజమౌళి స్టైల్ కంప్లీట్ గా వేరే. సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనేలా చేస్తాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మీద రామరాజు ఫర్ భీం .. భీం ఫర్ రామరాజు టీజర్స్ తో ఆ అంచనాలను స్కై రేంజ్ లో పెరిగేలా అంచనాలు నెలకొల్పాడు. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

RRR : ఓలియా మోరీస్ లుక్ తో ఆర్ఆర్ఆర్ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి..!

అందుకు రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఇంకాస్త ఆశలు పెంచాడు. కాగా తాజాగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీం పాత్రకి జంటగా నటిస్తున్న బ్రిటన్ మోడల్ ఓలియా మోరీస్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ లుక్ఆర్ఆర్ఆర్ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ లో రాం చరణ్ – ఎన్.టి.ఆర్ పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఈ క్లీమాక్స్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి