Home » Entertainment » Rrr Movie Rejected By These Heroines
Entertainment

RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాని ఇంత మంది ముద్దుగుమ్మ‌లు రిజెక్ట్ చేశారా.!

Authored By
Sam C
The Telugu News | Published on: April 1, 2022, 7:40 am
Advertisement

RRR Movie : భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాంటి సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. దాదాపు రూ. 600కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిందీ చిత్రం. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమలో ఆలియా భట్‌, బ్రిటిష్‌ నటి ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. అయితే వీరికంటే ముందే చాలా మంది హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వారు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించేందుకు రిజెక్ట్‌ చేశారట.

Advertisement

దీంతో జక్కన్న సినిమాలో ఛాన్స్‌ వదులుకున్న ఆ ఆ హీరోయిన్స్‌ ఎవరా అని నెటిజన్లు చర్చిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో వెండితెరకి వేడెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా అలియా భట్ క్యామియో తరహా రోల్ చేసింది. అలాగే ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించింది. కానీ వీళ్ళకంటే ముందు జక్కన్న చాలా మంది హీరోయిన్లని సంప్రదించారట. పలు కారణాల వల్ల వాళ్ళు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా పరిణీతి చోప్రాని సీత పాత్ర కోసం సంప్రదించారట. పాత్ర నిడివి, ఇతర కారణాల వల్ల పరిణీతి ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

RRR Movie rejected by these heroines

Advertisement

RRR Movie : ముందు వాళ్లు అనుకున్నారా..!

అలాగే సాహో బ్యూటీ శ్రద్దా కపూర్ ని కూడా సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. డేట్స్ అడ్జెస్ట్ కావడంతో ఆమె కూడా ఈ ఆఫర్ వదులుకుందట.ఇక ఎన్టీఆర్ హీరోయిన్ రోల్ కోసం మొదట రాజమౌళి 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అదే టైంకి అమీ జాక్సన్ ప్రెగ్నెంట్ కావడంతో ఆర్ఆర్ఆర్ చిత్రంలో జెన్నీ రోల్ వదులుకుంది. ఇక ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో ఎదుగుతున్న డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని జెన్నీ రోల్ కోసం ఎంపిక చేశారు. షూటింగ్ షురూ అయ్యే సమయానికి ఆమె తన పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుంది. దీనితో చివరకు ఆ ఆఫర్స్ ఒలీవియా మోరిస్, అలియా భట్ బుట్టలో పడ్డాయి. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబ‌లి రికార్డుల‌ని చెరిపేసేందుకు సిద్ద‌మ‌వుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి