Health Benefits : 40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కండరాలు పటుత్వం కోల్పోతాయి. హార్మోన్లు అసమతుల్యతగా ఉంటాయి. కొంతమంది మహిళలు విపరీతంగా బరువు పెరుగుతారు. అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. వీటిలో అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, ఊబకాయం, మానసిక సమస్యలు మొదలైనవి. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం, నిద్ర, ఒత్తిడి లేని జీవితంతో పాటు, రోజూ కొన్ని వ్యాయామాలు చేయాలి. కొన్ని ఆహార చిట్కాలు ఇప్పుడు చూద్దాం..యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం వల్ల 40 ఏళ్ల తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య పెరుగుతుంది. దీని బారి నుంచి వెల్లుల్లి కాపాడుతుంది.
అంతేకాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఐరన్, జింక్, విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, కాల్షియం, బీటా కెరోటిన్ వంటి అవసరమైన పోషకాలను గ్రీన్ వెజిటేబుల్స్ అందిస్తాయి. ఇవి మీ శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి.మహిళలకు డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఇందులోని ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. గుడ్లలో విటమిన్ డి ఉంటుంది కాబట్టి మహిళలు గుడ్లు తప్పనిసరిగా తినాలి. ఇది కాకుండా గుడ్డు మంచి కొవ్వు, ప్రోటీన్లకు మూలం.
రోజువారీ ఆహారంలో కనీసం 1 నుంచి 2 గుడ్లు చేర్చుకుంటే మంచిది. అలాగే అన్ని రకాల సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.శరీరానికి అత్యంత ముఖ్యమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చియా సీడ్స్ లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. చియా గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం స్మూతీల రూపంలో అల్పాహారంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అల్పాహారంగా కాల్షియం అధికంగా ఉండే పెరుగును కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.