Virupaksha Movie : ఈ విషయం తెలిస్తే వెంటనే విరూపాక్ష సినిమాకి బయలుదేరతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virupaksha Movie : ఈ విషయం తెలిస్తే వెంటనే విరూపాక్ష సినిమాకి బయలుదేరతారు..!

Virupaksha Movie : ప్రస్తుతం టాలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా విరుపాక్ష. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని కొన్ని నెలల రెస్ట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ.. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ సినిమాకు విడుదలయిన కొన్ని రోజులకు మౌత్ టాక్ ద్వారా హిట్ టాక్ రావడంతో జనాలు ఇప్పుడిప్పుడే ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు. సంయుక్త మీనన్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 April 2023,6:00 pm

Virupaksha Movie : ప్రస్తుతం టాలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సినిమా విరుపాక్ష. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని కొన్ని నెలల రెస్ట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ.. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ సినిమాకు విడుదలయిన కొన్ని రోజులకు మౌత్ టాక్ ద్వారా హిట్ టాక్ రావడంతో జనాలు ఇప్పుడిప్పుడే ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకు డైరెక్టర్.

sai dharam tej confirms Virupaksha Movie

sai dharam tej confirms Virupaksha Movie

సినిమా విడుదలై ఈరోజుకు 5 రోజులు అవుతోంది. ఈ సినిమా వీకెండ్ లో అయితే రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. యూఎస్ లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. వసూళ్లు బాగానే వస్తుండటంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. నిజానికి ఈ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ ఉన్నట్టుగా హింట్ ఇచ్చారు కానీ.. ఒకవేళ సినిమా హిట్ అయితే అప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించాలని మూవీ యూనిట్ భావించింది. ఇప్పుడు సినిమాకు మంచి టాక్ వస్తుండటంతో ఇక సీక్వెల్ ను అనౌన్స్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

Virupaksha pre-release event date locked | cinejosh.com

Virupaksha : ఉంది కాబట్టే హింట్ ఇచ్చాం అన్న సాయి ధరమ్ తేజ్

సినిమా క్లయిమాక్స్ లో తేజు కళ్లు చిత్రంగా మారడం తెలుసు కదా. ఎండ్ కార్డ్ పడగానే.. హీరో కూడా దయ్యం పట్టినట్టుగా కనిపిస్తాడు. అంటే సినిమా ఇంకా పూర్తవలేదు.. అనే హింట్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై ఓ నెటిజన్.. సాయిధరమ్ తేజ్ ను అడగగా.. సీక్వెల్ ఉంది కాబట్టే.. హింట్ ఇచ్చాం అంటూ సాయి రిప్లయి ఇచ్చాడు. అంటే.. సినిమా కథను బట్టి ముందే సీక్వెల్ తీయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. విరూపాక్ష సినిమా విజయంతో సాయి ధరమ్ తేజ్ మంచి జోరుమీదున్నాడు. విరూపాక్ష 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది