Sai Dharam Tej : విరూపాక్ష సినిమా తరవాత సాయి ధరమ్ తేజ్ ఒక్కొక్క సినిమా కి ఎంత తీసుకుంటున్నాడో చూడండి !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 April 2023, 11:00 am

Sai Dharam Tej : ‘ పిల్లా నువ్వు లేని జీవితం ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆ సినిమా హిట్ తర్వాత వరుస సినిమాలు చేసి తన పేరును పాపులర్ చేసుకున్నాడు. అయితే ‘ సుప్రీమ్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో అంతగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని ‘ విరూపాక్ష ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారు.

Sai Dharam Tej increase remuneration after Virupaksha movie

Sai Dharam Tej increase remuneration after Virupaksha movie

ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ కు వరుసగా రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.యంగ్ దర్శకులతో పాటు సీనియర్ దర్శకులు కూడా సాయిధరమ్ తేజ్ తో సినిమా చేయటానికి రెడీగా ఉన్నారు. సంవత్సరానికి రెండు సినిమాల తో సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని టాక్. అలాగే సాయి ధరమ్ తేజ్ తన రెమ్యూనరేషన్ ని పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సినిమాకు ఇచ్చే డేట్స్ ఆధారంగా రెమ్యూనరేషన్ భారీగా పెంచాలని తేజ్ భావిస్తున్నాడట. అతి త్వరలోనే సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.

Sai Dharam Tej Virupaksha movie news

Sai Dharam Tej Virupaksha movie news

మరోవైపు తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ వినోదయ సీతమ్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయినట్లు డైరెక్టర్ సముద్రఖని ఇటీవల ప్రకటించారు. ఇద్దరు మెగా హీరోలు కనిపించబోతున్న ‘ వినోదయ సీతమ్ ‘ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా సక్సెస్ అయితే సాయి ధరమ్ తేజ్ కి ఇండస్ట్రీలో తిరుగు ఉండదు అని సినీ వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp