Virupaksha Movie : విరూపాక్ష బాలీవుడ్ లో హిట్ అవుతుంది అంటారా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virupaksha Movie : విరూపాక్ష బాలీవుడ్ లో హిట్ అవుతుంది అంటారా ?

 Authored By prabhas | The Telugu News | Updated on :26 April 2023,4:00 pm

Virupaksha Movie : మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిరంజీవి మేనల్లుడుగా ‘ పిల్లా నువ్వు లేని జీవితం ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలు చేసి సుప్రీమ్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. అయితే మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో కొద్ది గ్యాప్ తీసుకొని ‘ విరూపాక్ష ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.

Sai Dharam Tej Virupaksha Movie released in bollywood

Sai Dharam Tej Virupaksha Movie released in bollywood

ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 24.35 కోట్లు వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా 50 కోట్ల వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ సినిమా హిట్ తో సాయి ధరమ్ తేజ్ , డైరెక్టర్ కార్తీక్ దండు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామని ప్రకటించారు. ఇప్పుడే కాకపోయినా కొంతకాలం తర్వాత దీనిని సీక్వెల్ గా తీసే అవకాశం ఉందని డైరెక్టర్ ప్రకటించారు.

రూ.50 కోట్ల క్లబ్ లోకి 'విరూపాక్ష'.. సాయిధరమ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు

ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. హిట్ అయితే ఇతర భాషల్లో డబ్ చేద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేసే అవకాశం ఉందట. అయితే ఇక్కడ హిట్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అవుతుందా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల నిఖిల్ కార్తికేయ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలై 100 కోట్లు వసూళ్లను సాధించింది. ఒకవేళ బాలీవుడ్ లో ఈ సినిమా హిట్ అయితే సాయి ధరంతేజ్ కి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. మరీ బాలీవుడ్ లో విరూపాక్ష సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది