Sai Dharam Tej : సాయి ధ‌ర‌మ్ తేజ్ ఏంటి బ‌క్కచిక్కి అంత దారుణంగా మారాడు..!

Authored By Sam C | The Telugu News | Published on: June 14, 2022, 12:30 pm

Sai Dharam Tej : మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాల‌తోనే కాకుండా త‌న ప్ర‌వ‌ర్త‌న‌తోను అంద‌రి మ‌న్న‌న‌లు పొందాడు. త‌న కెరీర్ సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో పెద్ద ప్ర‌మాదం బారిన ప‌డ్డాడు. దాదాపు నెల రోజుల‌కి పైన ఆసుప‌త్ర‌లో ఉన్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు మాములు మ‌నిషిగా మారాడు. 2021లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురి కాగా, కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. పూర్తిగా రికవరీ అయ్యే వరకు సాయి ధరమ్ మీడియా కంటికి కనిపించలేదు. కొద్ది నెలల తర్వాత మెగా హీరోలు అందరూ కలిసి సాయి ధరమ్ కి వెల్కమ్ చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ఆయన చేత కేక్ కట్ చేయించి, లోకానికి పరిచయం చేశారు. తర్వాత కూడా సాయి ధరమ్ బయట కనిపించడం మానేశారు.

షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు విక్రమ్ మూవీ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి.. కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి ఆయన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సల్మాన్ కూడా రావడం జరిగింది. విక్రమ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నితిన్, మెగా హీరోలు వరుణ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది. చిరు ఇంట్లో జరుగుతున్న ప్రముఖుల పార్టీ కావడంతో సాయి ధరమ్ కూడా హాజరయ్యారు. ఆ స‌మ‌యంలో సాయి ధ‌రమ్ చాలా సన్నగా మారిపోయి క‌నిపించాడు. ఒకప్పటి గ్లామర్ ఆయనలో లేదు. క్యాప్ ధరించి డీగ్లామర్ గా ఆయన కనిపించారు. సాయి ధరమ్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. తేజ్ కావాలనే సన్నబడ్డారా? లేక పూర్తిగా కోలుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

sai dharam tej new look viral

sai dharam tej new look viral

Sai Dharam Tej : తేజ్‌కి ఏమైంది?

సాయి ధరమ్ తేజ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాల్లో డాన్స్ లు, పాటలు, ఫైట్స్ వీటికి ప్రయారిటి ఎక్కువ ఇస్తూంటారు.ఇప్పుడు కథల్లో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అందుకు సంభందించిన మేకింగ్ పోస్టర్ విడుద‌ల చేశారు.చేతబడి ( బ్లాక్ మ్యాజిక్) నేపథ్యంలో కథ, కథనాలు సాగుతాయని సమాచారం. చేతబడికి బలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామానికి, ముంబై నుంచి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా ఛేదిస్తాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనే ఇతివృత్తంతో ఈ కథ..నడుస్తుందని అని టాక్ వినిపిస్తోంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp