Categories: EntertainmentNews

Sai Dharam Tej : అల్లు అర్జున్‌పై స‌డెన్‌గా సాయి ధ‌ర‌మ్‌కి ఎందుకంత కోపం వ‌చ్చింది.. కార‌ణం ఇదా?

Sai Dharam Tej : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు బాబు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు ఇది లక్షలాది మంది మెగా, పవన్, జనసేన అభిమానులకు అరుదైన క్షణం . పదేళ్ల పాటు కష్టపడి, ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను భరించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని సగర్వంగా అందుకోవ‌డంతో మెగా ఫ్యామిలీ అంతా ప‌వ‌న్ సంతోష‌క్ష‌ణాల‌లో పాలు పంచుకున్నారు. ఇలాంటి అరుదైన ఘ‌ట్టానికి అల్లు ఫ్యామిలీ నుండి ఒక్క‌రు కూడా రాక‌పోవ‌డంతో సాయిధ‌ర‌మ్ తేజ్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు.

Sai Dharam Tej ఏంటి.. స‌మ‌స్య‌

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసిపిఅభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసినా, వైసిపి అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు, మెగా అభిమానులకు అస్సలు రుచించలేదు. దీనిపై అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి పెద్దఎత్తున ట్రోల్ చేశారు. అదే స‌మ‌యంలో జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన నాగబాబు అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని పలువురు జనసైనికులు భావించారు.

Sai Dharam Tej : అల్లు అర్జున్‌పై స‌డెన్‌గా సాయి ధ‌ర‌మ్‌కి ఎందుకంత కోపం వ‌చ్చింది.. కార‌ణం ఇదా?

అయితే జూన్ 12న జ‌రిగిన ప‌వ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం కార్య‌క్రమానికి మెగాస్టార్ కుటుంబం మొత్తం హాజరైంది. చిరంజీవి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఇందులో పాల్గొన్నారు. సురేఖ, రామ్ చరణ్, శ్రీజ, నాగబాబు, నీహారిక, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందుబాటులో ఉన్న మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.అల్లు అరవింద్ ఫ్యామిలీ దీనికి దూరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్‌ను..అటు సాయి ధరమ్ తేజ్ కూడా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. బ‌న్నీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)ను సాయి ధరమ్ తాజాగా అన్ ఫాలో కొట్టాడు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమౌతోంది. అయితే తేజ్ శిరీష్‌ని మాత్రం ఫాలో అవుతున్నాడు.

Recent Posts

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

9 minutes ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

2 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

4 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

6 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

8 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

9 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

10 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

11 hours ago