Sai Dharam Tej : అల్లు అర్జున్‌పై సడెన్‌గా సాయి ధరమ్‌కి ఎందుకంత కోపం వచ్చింది.. కారణం ఇదా?
ప్రధానాంశాలు:
Sai Dharam Tej : అల్లు అర్జున్‌పై సడెన్‌గా సాయి ధరమ్‌కి ఎందుకంత కోపం వచ్చింది.. కారణం ఇదా?
Sai Dharam Tej : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు బాబు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు ఇది లక్షలాది మంది మెగా, పవన్, జనసేన అభిమానులకు అరుదైన క్షణం . పదేళ్ల పాటు కష్టపడి, ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను భరించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని సగర్వంగా అందుకోవడంతో మెగా ఫ్యామిలీ అంతా పవన్ సంతోషక్షణాలలో పాలు పంచుకున్నారు. ఇలాంటి అరుదైన ఘట్టానికి అల్లు ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాకపోవడంతో సాయిధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
Sai Dharam Tej ఏంటి.. సమస్య
ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసిపిఅభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసినా, వైసిపి అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు, మెగా అభిమానులకు అస్సలు రుచించలేదు. దీనిపై అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి పెద్దఎత్తున ట్రోల్ చేశారు. అదే సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన నాగబాబు అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని పలువురు జనసైనికులు భావించారు.
అయితే జూన్ 12న జరిగిన పవన్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం మొత్తం హాజరైంది. చిరంజీవి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఇందులో పాల్గొన్నారు. సురేఖ, రామ్ చరణ్, శ్రీజ, నాగబాబు, నీహారిక, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందుబాటులో ఉన్న మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.అల్లు అరవింద్ ఫ్యామిలీ దీనికి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను..అటు సాయి ధరమ్ తేజ్ కూడా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. బన్నీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)ను సాయి ధరమ్ తాజాగా అన్ ఫాలో కొట్టాడు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమౌతోంది. అయితే తేజ్ శిరీష్‌ని మాత్రం ఫాలో అవుతున్నాడు.