Sai Pallavi : సాయి పల్లవిని అంత మాట అనేశారు.. సీత పాత్రకి ఆమె వేస్ట్ అన్న సునీల్
Sai Pallavi : గ్లామర్ ఒలకబోస్తేనే హీరోయిన్‌లు అవ్వొచ్చు. తిరుగులేని పాపులారిటీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్న నేటి తరంలో.. గ్లామర్‌కు అతీతంగా సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వారిలో సాయి పల్లవి తప్పక ఉంటారు. స్టార్ హీరోలకు సైతం లేని అభిమానగళాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి.మహానటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఆ రేంజ్‌లో తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలా అని ఈ మలయాళ కుట్టి వందేసి కోట్ల సినిమాలు చేయలేదు. ఆమె నటించిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు కూడా కొల్లగొట్టేలేదు. కానీ.. తన నటన, అభినయంతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది.
దంగల్’ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా ‘రామాయణం’ అనే మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. ఇటీవల కొన్ని చిత్రాలు లీక్ అవ్వగా, అందులో రణబీర్ కపూర్ రాముడి గెటప్‌లో, సాయి పల్లవి తల్లి సీత పాత్రలో కనిపించింది. అభిమానులకు వీరిద్దరి లుక్ తెగ నచ్చింది. కానీ సునీల్ లాహ్రి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సునీల్ లాహ్రి.. టీవీ సిరీస్ రామాయణంలో లక్షణుడిగా నటించారు. ఆయన మాట్లాడుతూ “యానిమల్ సినిమా చూసిన తర్వాత రణబీర్‌ను రాముడిగా ఊహించుకోవడం కష్టంగా ఉంది.
Sai Pallavi : సాయి పల్లవిని అంత మాట అనేశారు.. సీత పాత్రకి ఆమె వేస్ట్ అన్న సునీల్
ఇక సీత పాత్రధారి సాయి పల్లవిలో సీత పోలికలు ఏమాత్రం కనిపించట్లేదు. నటిగా ఆమె ఎలా ఉంటుందో తెలియదు ఆమె సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు’’ అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునీల్ లాహ్రి కామెంట్స్‌కు సాయి పల్లవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి లాంటి నటి గురించి ఇలా కామెంట్స్ చేయడం సరికాదు అని అంటున్నారు. మరి దీనిపై రామాయణ్ టీమ్ ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.