
Saif Ali Khan : యూపీఐ పేమెంట్ సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని పట్టించిన యూపీఐ
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పేరు ఇటీవల వార్తలలో తెగ నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయనపై కత్తి దాడి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. నిందితుడ్ని ముంబై పోలీసులు Mumbai Police పట్టుకున్నారంటూ శనివారం నాడు కథనాలు వచ్చాయి. బాండ్రా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో Socila Media తెగ హల్‌చల్ చేశాయి. దీంతో నిందితుడు దొరికాడని అంతా అనుకున్నారు. అయితే తమ అదుపులో ఉన్నది నిందితుడు కాదని.. ఆ వ్యక్తికి సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది సేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను ఆదివారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని పట్టించిన యూపీఐ
విచారణ జరిపిన కోర్టు షెజాద్‌ను 5 రోజుల పోలీసు కస్టడీలో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సైఫ్ దాడికి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సైఫ్ పై దాడి తర్వాత నిందితుడు ఎక్కడి వెళ్ళాడు? ఏం చేశాడు? ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనవరి 16న 3 గంటల ప్రాంతంలో సైఫ్ అలీఖాన్ పై దాడి తర్వాత.. నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోని ఉన్నాడని.. అక్కడే ఓ బస్ స్టాప్ లో నిద్రించాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఆతర్వాత రైలు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు వెల్లడించారు.
బంగ్లాదేశ్ పౌరుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్‌లోకి India అక్రమంగా ప్రవేశించాడని. తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని గత ఆరు నెలల నుంచి ముంభైలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే అతడితో దేశానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు కార్డు కూడా లేదని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో నిందితుడి బ్యాగు నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్, నైలాన్ తాడుతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బ్యాగ్‌లో ఇలాంటివి కనిపించడంతో అతడికి నేరచరిత్ర ఉండి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు ఒక విషయాన్ని బయటపెట్టాడు. మహ్మద్ తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశారని, ఆ తర్వాత యూపీఐ పేమెంట్ చేయడంతో నిందితుడు నెంబర్ తెలుసుకొని పోలీసులు లొకేషన్ ట్రేస్ చేశారు. ఠానేలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అక్కడ పట్టుకోవాలని అనుకున్నారు. అతడు అక్కడి నుండి పారిపోవాలని చూడగా, చుట్టు ముట్టి అదుపులోకి తీసుకున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.