Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని ప‌ట్టించిన యూపీఐ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని ప‌ట్టించిన యూపీఐ

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Saif Ali Khan : యూపీఐ పేమెంట్ సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని ప‌ట్టించిన యూపీఐ

Saif Ali Khan : బాలీవుడ్ Bollywood ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పేరు ఇటీవ‌ల వార్త‌ల‌లో తెగ నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆయ‌న‌పై క‌త్తి దాడి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. నిందితుడ్ని ముంబై పోలీసులు Mumbai Police పట్టుకున్నారంటూ శనివారం నాడు కథనాలు వచ్చాయి. బాండ్రా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో Socila Media  తెగ హల్‌చల్ చేశాయి. దీంతో నిందితుడు దొరికాడని అంతా అనుకున్నారు. అయితే తమ అదుపులో ఉన్నది నిందితుడు కాదని.. ఆ వ్యక్తికి సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది సేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను ఆదివారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.

Saif Ali Khan సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని ప‌ట్టించిన యూపీఐ

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని ప‌ట్టించిన యూపీఐ

Saif Ali Khan అలా దొరికాడు..

విచారణ జరిపిన కోర్టు షెజాద్‌ను 5 రోజుల పోలీసు కస్టడీలో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సైఫ్ దాడికి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సైఫ్ పై దాడి తర్వాత నిందితుడు ఎక్కడి వెళ్ళాడు? ఏం చేశాడు? ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనవరి 16న 3 గంటల ప్రాంతంలో సైఫ్ అలీఖాన్ పై దాడి తర్వాత.. నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోని ఉన్నాడని.. అక్కడే ఓ బస్ స్టాప్ లో నిద్రించాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఆతర్వాత రైలు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు వెల్లడించారు.

బంగ్లాదేశ్ పౌరుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్‌లోకి  India అక్రమంగా ప్రవేశించాడని. తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని గత ఆరు నెలల నుంచి ముంభైలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే అతడితో దేశానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు కార్డు కూడా లేదని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో నిందితుడి బ్యాగు నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్, నైలాన్ తాడుతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బ్యాగ్‌లో ఇలాంటివి కనిపించడంతో అతడికి నేరచరిత్ర ఉండి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసుల విచార‌ణ‌లో నిందితుడు ఒక విష‌యాన్ని బ‌యట‌పెట్టాడు. మ‌హ్మ‌ద్ త‌న వ‌ద్ద ప‌రోటా, వాట‌ర్ బాటిల్ కొనుగోలు చేశార‌ని, ఆ త‌ర్వాత యూపీఐ పేమెంట్ చేయ‌డంతో నిందితుడు నెంబ‌ర్ తెలుసుకొని పోలీసులు లొకేష‌న్ ట్రేస్ చేశారు. ఠానేలో ఉన్న‌ట్టు గుర్తించిన పోలీసులు అత‌డిని అక్క‌డ ప‌ట్టుకోవాల‌ని అనుకున్నారు. అత‌డు అక్క‌డి నుండి పారిపోవాల‌ని చూడ‌గా, చుట్టు ముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది