Samantha about opened her divorce
Samantha : ఏ మాయ చేశావె సినిమా టైమ్ లో ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు నాగ చైతన్య- సమంత. వారి రెండు ఫ్యామిలీల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. తరువాత 4 ఏళ్ల పాటు వీరు అన్యోన్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అప్పటి నుండి సమంత- నాగ చైతన్య బద్ధ శత్రువులుగా మారారు. ముఖ్యంగా సమంతని తెగ ట్రోల్స్ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పెట్టారు. వీటిపై చైతూ ఏ మాత్రం స్పందించలేదు. అయితే వీరు విడిపోయి ఏడాది కావొస్తున్నా కూడా ఇప్పటికీ వారి విడాకుల మేటర్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా సమంత విడాకుల విషయంపై నోరు విప్పగా ఆమె ఏం మాట్లాడిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.
ఎంతో అన్యోన్యంగా కనిపించే సమంత- నాగ చైతన్య జంట విడాకుల ప్రకటన చేయడంతో అటు అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎప్పుడూ సరదగా కనిపించే ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. విడిపోయిన తర్వాత వీరిద్దరు ఎవరికీ వారు సినిమాలతో బిజీగా మారిపోయారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తాను విడాకుల సమయంలో రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై కూడా స్పందించింది. నాకు భరణంగా 250 కోట్లు వచ్చాయని పుకార్లు వచ్చాయి. అవి అబద్ధపు ప్రచారాలు అని అందరికి తెలిసిపోయింది. ముఖ్యంగా మీడియాకు తెలిసిపోయింది. అందుకే ఆ రూమర్స్ వాటంతట అవే ఆగిపోయాయి అంటోంది సామ్. ఇలా తన డివోర్స్ గురించి ఫస్ట్ టైమ్ నోరి విప్పింది సామ్.
Samantha about opened her divorce
నాగ చైతన్యతో విడిపోయిన తరువాత జీవితం ఎలా ఉంది అని కరణ్ జోహర్ అడగ్గా.. విడాకుల తరువాత తన జీవితం చాలా కష్టంగా మారిందని చెప్పింది సమంత. కాని తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాననంటోంది. నాగచైతన్యతో విడిపోవడం అందరూ అనుకుంటున్నట్టు సామరస్యంగా జరగలేదని.. విడిపోయిన తరువాత తాను చాలా మనోవేదనకు గురైనట్లు తెలియజేసింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తాను చెప్పలేనుకాని ప్రస్తుతం అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అంటోంది సమంత. ఇక చైతూతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడింది. విడాకుల తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను వాటిపై ఏం చేయలేకపోయాను అంటోంది సామ్. అలాగే చైతన్యకు మీకు మధ్య ఏవైన కఠినమైన భావాలు ఉన్నాయా అని అడగ్గా..
మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది అని చెప్పింది. ఇక విడాకుల సమయంలో జీవితం కష్టంగా మారింది.ఆ పక్రియ అంత సులువుగా ఏం జరగలేదు. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగు పడ్డాయి. గతంలో కంటే నేను ఇప్పుడు చాలా బలంగా మారాను’ అని భావోద్వేగానికి గురైంది సమంత. ఇక కరణ్ డబ్బు కోసం మీరు చేయని పని ఏంటని అడగ్గా.. నేను డబ్బు కోసం చేయని పనుల్లో సినిమాతో పాటు చాలా విషయాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇక సమంత ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.
కథా, పాత్రలపరంగా డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌తో సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఓ సినిమాని తెరకెక్కించనుండగా, ఈ సినిమాలో సమంత పాత్రను సరికొత్తగా డిజైన్ చేశారట. నెగెటివ్ షేడ్స్‌తో సాగే పోలీస్ ఆఫీసర్‌గా ఆమె పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ ప్రేయసిగా సమంత నటించడం లేదని, కథానుగుణంగా ఈ జోడీ మధ్య వైరం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోద చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. తళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సరసన సమంత నాయికగా నటిస్తున్నది. వీరిద్దరు కలిసి నటిస్తున్న నాలుగో చిత్రమిది కావడం విశేషం.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.