Samantha : టాప్ హీరోయిన్స్ ఒకే ఫ్రేములో.. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారంటున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : టాప్ హీరోయిన్స్ ఒకే ఫ్రేములో.. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారంటున్న నెటిజ‌న్స్

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో స‌మంత‌, కీర్తి సురేష్ త‌ప్ప‌క ఉంటారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. స‌మంత గ‌త కొన్నాళ్లుగా అద్భుత‌మైన సినిమాలు చేస్తూ ఉన్న‌త స్థాయికి చేరుకోగా, కీర్తి సురేష్‌.. మ‌హాన‌టి చిత్రంతో టాప్ స్టార‌ర్‌గా మారింది. తాజాగా ఈ అమ్మ‌డు స‌ర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోయిన్స్ మ‌ధ్య సాన్నిహిత్యం ఉండ‌గా, కీర్తి సురేష్, స‌మంత అప్పుడ‌ప్పుడు క‌లుసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :28 May 2022,8:00 pm

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో స‌మంత‌, కీర్తి సురేష్ త‌ప్ప‌క ఉంటారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. స‌మంత గ‌త కొన్నాళ్లుగా అద్భుత‌మైన సినిమాలు చేస్తూ ఉన్న‌త స్థాయికి చేరుకోగా, కీర్తి సురేష్‌.. మ‌హాన‌టి చిత్రంతో టాప్ స్టార‌ర్‌గా మారింది. తాజాగా ఈ అమ్మ‌డు స‌ర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోయిన్స్ మ‌ధ్య సాన్నిహిత్యం ఉండ‌గా, కీర్తి సురేష్, స‌మంత అప్పుడ‌ప్పుడు క‌లుసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు.

తాజాగా కీర్తి సురేష్‌, స‌మంత ఒకే ఫ్రేములో క‌నిపిస్తుండ‌గా, వారిద్ద‌రిని చూసి నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే ఫ్రేములో క‌నిపిస్తుండ‌డం సంతోషంగా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.ఒరామ్యాక్స్ మీడియా అందించిన వివరాల ప్రకారం.. సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ సర్వే నిర్వహించగా.. సమంతకు 265k ఓట్లు లభించాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఆలియాభట్ నిలిచింది. RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్న ఈ నటి 244k ఓట్లు రాబట్టుకొన్నది. ఇక మూడో స్థానాన్ని లేడీ సూపర్ స్టార్ నయనతార సొంతం చేసుకొన్నది. నయనతారకు 218k ఓట్లు లభించాయి.

samantha and Keerthi Suresh in single frame

samantha and Keerthi Suresh in single frame

Samantha : క్యూట్ పిక్..

కత్రినా కైఫ్, కీర్తీ సురేష్, పూజా హెగ్డే వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచారు.ఇటీవలే పెళ్లి చేసుకొన్న కత్రినా 145K ఓట్లతో, సర్కారు వారీ పాటతో గ్లామర్ డోస్ పెంచిన కీర్తి సురేష్ 9వ స్థానంలో 128k ఓట్లతో తన ర్యాంకింగ్ మెరుగు పరుచుకొన్నది. 10వ స్థానంలో పూజా హెగ్గే పేలవమైన ఓట్లు సాధించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల కాలంలో వరుసగా మూడు ఫ్లాప్‌లతో బుట్టుబొమ్మ చేదు అనుభవాన్ని చవిచూసింది. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం ద‌స‌రా చిత్రంతో పాటు చిరంజీవి భోళా శంక‌ర్ చేస్తుంది. ఇక స‌మంత న‌టించిన శాకుంత‌లం, య‌శోద‌, ఖుషీ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది