Samantha : అల్లు అర్జున్ భార్య ఇన్ స్టా పోస్ట్ పై సమంత కామెంట్…
Samantha : తెలుగు స్టార్ హీరోలకు ఎంత పేరుందో వారి సతీమణులు కూడా అదే స్థాయిలో నేమ్ తెచ్చుకుంటున్నారు. ఇలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన, బన్నీ భార్య స్నేహ, నాని భార్య అంజనా వారి భర్తలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినప్పటికీ కేవలం సామాజిక మధ్యమాల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఉపాసన, స్నేహ రెడ్డి మాత్రం వారి వారి కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటునే ఉన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహకు…
ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్ మిలియన్ పైన ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె ఏ చిన్న పోస్ట్ చేసినా అది నెట్టింట వైరల్‌గా మారుతోంది.ఫ్యాషన్‌పై ఎక్కువ ఆసక్తి చూపించే స్నేహా రెడ్డి తన వ్యక్తిగత ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా స్నేహ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే వారితో పాటు టాలీవుడ్ యాపిల్ బ్యూటీ కూడా స్నేహ ను పొగుడుతూ పెట్టిన ఓ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తాజాగా తాజాగా నలుపు రంగు చీరను ధరించిన ఓ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు.

samantha comments on allu arjun wife sneha reddy instagram post
Samantha : స్నేహ రెడ్డి పోస్ట్ కి హాట్ అంటూ కామెంట్ చేసిన సమంత :
మల్హోత్ర డిజైన్ చేసిన ఈ చీరలో స్నేహ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఎంతో అందంగా కనిపించారు.బ్యూటిఫుల్ అంటూ ఈ ఫోటోపై ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండగా స్టార్ హీరోయిన్ సమంత సైతం… హాట్.. అంటూ స్నేహ రెడ్డి పోస్ట్ కింద కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విడాకుల వరుస చిత్రాలకు సైన్ చేస్తూ బిజీగా మారిన సమంత… లేటెస్ట్ గా అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్పలో ఐటెం సాంగ్ చేసింది. రిలీజ్ కు ముందే వివాదాస్పదమైన ఈ సాంగ్ పై ప్రశంసలతో ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి.