Samantha : అలా ఉండటం నా వల్ల కాదు.. ఆ విషయాలపై ఓపెన్ అయిన సమంత..

Authored By mallesh | The Telugu News | Published on: January 12, 2022, 11:00 am

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలను ప్రజెంట్ అస్సలు పట్టించుకోవడం లేదు. నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత ఈ భామ తన ఫోకస్ మొత్తం ప్రొఫెషనల్ కెరీర్ పైనే పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ దూసుకెళ్తోంది. హిందీ ప్రాజెక్ట్స్ పైన కూడా దృష్టి పెడుతూ, పాన్ ఇండియా ఫిల్మ్సే కాదు.. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా సైన్ చేస్తోంది. తాజాగా తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది ఈ సుందరి. సమంత..నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ అయింది. కానీ, విడుదల తేదీపైన ఇంకా స్పష్టత రాలేదు.

ఈ సంగతి అలా ఉంచితే.. తాజాగా సమంత.. తన వ్యక్తిగత జీవితం, అలవాట్లపైన మీడియాతో ముచ్చటించింది. తన హ్యాబిట్స్ గురించి వివరించింది. తాను ప్రతీ రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేస్తానని, అలా తనకు డే స్టార్ట్ అవుతుందని తెలిపిన సమంత,.. ప్రతీ రోజు మార్నింగ్ టైమ్స్‌లోనే డే మొత్తం ఎలా ఉండబోతుందని ఆలోచిస్తానని తెలిపింది. ఏయే పనులు చేయాలో ముందే డిసైడ్ అయి నూతనోత్తేజంతో ముందకు సాగుతానని అంది సమంత.తాను పూర్తి వేగన్‌గా మారిపోయానని, శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డానని, అలా తనకు వ్యక్తిగతంగా విపరీతమైన స్వేచ్ఛ ఉందని తెలిపింది. తనకు పిల్లలతో గడపడం చాలా ఇష్టమని, తనకు సానుభూతి కూడా చాలా ఎక్కువని, అదే తనకు

samantha comments on her personal habbits

samantha comments on her personal habbits

Samantha : సమంత రోజంతా ఏం చేస్తుందంటే..

సినీ కెరీర్‌లో ఉపయోగపడిందని అనుకుంటున్నానని చెప్పింది.ప్రతీ రోజు జిమ్ వర్కవుట్స్ పైన దృష్టి సారిస్తానని, సవాలుతో కూడిన పనులు చేయడం తనకు ఇష్టమని అంది సమంత. ఇకపోతే తాను తనతో మాత్రమే పోటీ పడుతానని అలా తనను తాను చాలెంజ్ చేసుకుంటానని అంది నాగ చైతన్య మాజీ భార్య. కొత్త విషయాలను నేర్చుకునేందుకుగాను ఆసక్తి చూపుతానని, గదిలో ఒంటరిగా అస్సలు ఉండలేనని, బయటకు వచ్చి నూతన విషయాలను తెలుసుకుంటానని వివరించింది సమంత.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp