Samantha : బాబోయ్ సమంత ఎద అందాలతో మాములు టెంప్ట్ చేయట్లేదుగా.. కుర్రాళ్లు ఏమై పోవాలి..!
Samantha: అక్కినేని ఫ్యామిలీతో తన బంధాన్ని తెంచుకున్న తర్వాత సమంత తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. సినిమాలు, టీవీ షోస్, గ్లామర్ షోతో ఇలా నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. సమంతకి సంబంధించి ఎలాంటి ఫోటోలైనా, పోస్టులైనా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇక ఈ మధ్య కమర్షియల్ ఫోటో షూట్‌లకు కూడా సమంత గట్టిగానే ఫోజులిస్తుంది. అయితే రీసెంట్‌గా కాస్మోపోలిటన్ అనే మ్యాగజైన్‌కి ఫోటోషూట్ నిర్వహించిన సమంత ఆ మ్యాగజైన్ కవర్ పేజిపై ఎవరూ ఊహించని స్థాయిలో కనిపిస్తుంది. సమంత గ్లామర్‌ని చూసిన అభిమానులు ఇందులో మరింత అందంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత లుక్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.సమంత జోరు.. కుర్రకారు హుషారుతెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే సమంత మంచి గుర్తింపును అందుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఎన్నో విజయాలు కూడా దక్కాయి. దీంతో ఆమె మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్ పెరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత మరింత స్పీడు పెంచేసింది. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ‘సామ్ జామ్’ షోను హోస్టు చేసి డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది.

samantha cover page looks viral
ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర అదిరిపోయింది. దీనితో సమంత తన రేంజ్‌ను జాతీయ స్థాయికి పెంచుకుంది.సమంత గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీ షూట్ పూర్తి చేసుకుంది.ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు మూవీ షూట్‌లు కంప్లీట్ అయ్యాయి. త్వరలో పలు బాలీవుడ్ సినిమాలలో నటించేందుకు కూడా ఆసక్తి చూపుతుంది. చూస్తుంటే సమంత జోరు ఇటీవలి కాలంలో మాములుగా ఉండదు అని అర్ధమవుతుంది.