Samantha : “శాకుంతలం” సినిమా ట్రైలర్ ఈవెంట్ లో వేదికపై బోరున ఏడ్చిన సమంత.. వీడియో
Samantha : గుణశేఖర్ దర్శకత్వంలో హీరోయిన్ సమంత నటించిన “శాకుంతలం” సినిమా ట్రైలర్ ఈవెంట్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ .. హీరోయిన్ సమంతనీ ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. సినిమా మేకింగ్ చాలా పర్ఫెక్ట్ గా జరిగిందని తెలియజేశారు. సమంతా నటన సినిమాకి హైలెట్ అని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ మాటలతో సమంత వేదికపై బోరన ఏడ్చింది. అందరూ చూస్తుండగానే ఆమె కంటతడి పెట్టుకోవడం జరిగింది. మాయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత
సమంత ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చింది ఫిబ్రవరి 17వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో శకుంతలం ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాతో మలయాళ నటుడు దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అడవిలో శకుంతల ఆశ్రమ వాసం… మరోపక్క రాజ్యంలో దుష్యంతుడి రాజరకం
ఇద్దరి మధ్య పరిచయం మరియు ప్రేమ ఇంకా వివాహం విరహం దుర్వాసుడి శాపం… భరతుడి జననం.. ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. రెండున్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ చివరిలో అల్లు అర్జున్ కూతురు అర్హను భరతుడి పాత్రలో సింహం పై వచ్చేలా పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. శేఖర్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ సంగీత దర్శకుడు మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దిల్ రాజు మరియు గుణశేఖర్ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల 17వ తారీకు రిలీజ్ అవుతుంది.
