సమంత డెబ్యూ వెబ్ సిరీస్ పాన్ ఇండియన్ సినిమాని మించి ఉందే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

సమంత డెబ్యూ వెబ్ సిరీస్ పాన్ ఇండియన్ సినిమాని మించి ఉందే ..!

 Authored By govind | The Telugu News | Updated on :7 January 2021,2:41 pm

సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. జాను సినిమా అట్టర్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ సమంత నుంచి సినిమా ఏదీ రాలేదు. కాని అందరిలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచిన ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవంగా ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా వీఎఫెక్స్ వర్క్ పూర్తవకపోవడం తో పెండింగ్ పడింది.

The Family Man 2 gets a release date | Entertainment News,The Indian Express

కాగా తాజాగా ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఒక టీజర్ రిలీజ్ చేసి ప్రకటించారు. రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించిన ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. సీనన్ 1 లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించారు. సీజన్ 2 లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి లతో పాటు సమంత నటించింది. ఇక స్సిజన్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా మొదటి సారి సమంత తన పాత్ర కి తానే డబ్బింగ్ చెప్పుకుంది.

ఇక రీసెంట్ గా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటించబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాని గుణశేఖర్ నిర్మిస్తూ .. దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్టు తాజాగా గుణశేఖర్ బృందం వెల్లడించారు. ఇక జాను డిజాస్టర్ తర్వాత సమంత నుంచి రాబోతున్న సినిమా శాకుంతలం కావడం విశేషం. అలాగే తమిళంలో కూడా సమంత విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

 

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది