Samantha : సమంత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తగ్గేదే లే అనుకుంటూ దూసుకుపోతుంది. తాను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తూ హడావిడి చేస్తుంది. సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తగా, ఇప్పుడు మళ్లీ అలాంటి ఛాలెంజింగ్ పాత్రకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌ను రూపొందించిన రాజ్, డీకే తాజాగా దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్న వెబ్ సిరీస్‌లో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం.
రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిట్టాల్ అనే అమెరికా వెబ్ సిరీస్‌ను ఇండియన్ భాషల్లో రీమేక్ చేయనున్నారు. నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్న ఇందులో యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉండటంతో ఇప్పుడు వారిద్దరూ ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాలు కాకుండా ఒళ్లు జలదరించే విధంగా చోటు చేసుకోవడంతో శిక్షణ కాలం అధికంగా ఉంటుందని తెలిసింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో డీగ్లామర్ రోల్ లో నటిస్తూ నెగిటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటించింది. అయితే కొందరు ఫ్యాన్స్ సమంతని ఈ పాత్రలో జీర్ణించుకోలేకపోయారు. కానీ సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. విమర్శలని పట్టించుకోకుండా ఈ తరహా పాత్రలని సామ్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో, వెబ్ సిరీస్ లలో పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
Samantha Doing Same Role Again In A Movie
మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న ఈమె సమంత సంచలన కథానాయికగా కనిపిస్తోంది. పుష్పలో ఐటమ్ సాంగ్‌తో ఇరగదీసింది. తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖుషి, యశోద, శకుంతలం సినిమాలున్నాయి. బాలీవుడ్ అవకాశాన్ని కూడా సమంత కైవసం చేసుకుంది. ప్రస్తుతం సమంత ప్రముఖ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్-డీకే సహ దర్శకత్వం వహించే కొత్త వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. రానున్న రోజులలో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులని మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.