Samantha : పుష్ప సెట్‌లో అడుగుపెట్టిన సమంత.. అభిమానులు మీకు పండగే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : పుష్ప సెట్‌లో అడుగుపెట్టిన సమంత.. అభిమానులు మీకు పండగే..

 Authored By mallesh | The Telugu News | Updated on :29 November 2021,4:00 pm

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సంచలన దర్శకుడు సుకుమార్ తొలిసారిగా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాను ఓ క్రైం స్టోరీ నేపథ్యంలో సుకుమార్ ప్లాన్ చేశారట.. ఇప్పటివరకు దర్శకుడు సుకుమార్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితై పుష్ప సినిమా అంతకు మించి ఉంటుందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది. బన్నీకి ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ఆర్య, ఆర్య-2 ఇచ్చిన సుక్కు ఈ సారి అల్లు అర్జున్‌ను డిఫరెంట్ లుక్‌లో చూపిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ చాలా ఇచ్చింది మూవీ టీం. పుష్ప సినిమా నుంచి రెండు సాంగ్స్ విడుదలవ్వగా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సామీ సామీ సాంగ్ మాత్రం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సుకుమార్ జిగిరి దోస్త్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో అక్రంగా సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా నడవనుందని తెలుస్తోంది. ఇందులో హీరో బన్నీ పుష్ఫరాజ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అందుకోసం తన కట్టుబొట్టు మొత్తం మార్చేసాడు. చూడటానికి నిజంగానే స్మగ్లర్ అనేలా బన్నీకి రూపమిచ్చాడు సుక్కు..

samantha enters the floral set

samantha enters the floral set

Samantha : సామ్‌తో స్పెషల్ సాంగ్..

పుష్ప సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17 విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు మూవీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ మూవీలో సుకుమార్ స్పెషల్ సాంగ్ అనుకున్నారట.. అందుకోసం చాలా మందిని అనుకున్నారట.. కానీ చివరకు సమంత దగ్గరకు వచ్చి ఆగింది సుక్కు ఐడియా.. సామ్ కూడా అందుకు ఓకే చెప్పగా.. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో సామ్ ఈరోజు ఎంట్రీ ఇచ్చినట్టు తెలిసింది. ఐటం సాంగ్స్ తీయడంలో దర్శకుడు సుకుమార్ తన మార్క్ చూపిస్తాడని అందరికీ తెలిసిందే.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది