Samantha : నాగచైతన్యపై రివెంజ్ కోస‌మేనా.. సమంత ఈ స్పెషల్ సాంగ్‌..!

Authored By mallesh | The Telugu News | Published on: December 14, 2021, 1:00 pm

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య విడిపోయిన సంగతి అందరికీ విదితమే. ప్రజెంట్ సమంత, నాగచైతన్య ఇద్దరూ.. తమ ప్రొఫెషనల్ కెరీర్స్‌పైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సమంత ఇటీవల స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పింది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చిందేసింది. కాగా, ఈ సాంగ్‌ను సమంత నాగచైతన్యపైన రివెంజ్ తీసుకోవడం కోసమే చేసిందని సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ..’ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లోనూ ఉంది. ఈ పాట వీడియో కూడా ఇటీవల విడుదల కాగా అందులో సమంత చాలా అందంగా కనబడుతోంది. హాట్ లుక్స్‌తో అదరగొట్టేస్తుంది. ఇప్పటివ‌ర‌కు తన కెరీర్‌లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని స‌మంత‌..‘పుష్ప‌’లో స్పెష‌ల్ సాంగ్‌కు ఓకే చెప్ప‌డంతో ఇది ఎలా ఉండ‌బోతుందో చూడాల‌ని అంద‌రూ ఈగర్‌గా వెయిట్ చేశారు. రీసెంట్‌గా విడుదలైన ప్రోమోను చూసి సినిమాలో ఇంకా అదిరిపోతుందని అర్థమవుతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

samantha in a special song revenge on naga chaitanya

samantha in a special song revenge on naga chaitanya

Samantha : ఆ పదాలు నాగచైతన్యను ఉద్దేశించినవేనా?

హాట్ లుక్స్‌తో లంగా జాకెట్‌లో సమంత వేసిన స్టెప్పులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. అయితే, ఈ సాంగ్‌లోని లిరిక్స్ నాగచైతన్య ఉద్దేశించి రాసినట్లు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘పెద్దమనిషిలాగా ఒకడు ఫోజులు కొడతాడు.. మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డా కాదు అంతా ఒకటే జాతి.. మగబుద్ధే వంకర బుద్ధి’ అంటూ సాగే ఈ లిరిక్స్‌ నాగచైతన్యను ఉద్దేశించి రాసినవే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సినిమా సన్నివేశాన్ని బట్టి రాశారు తప్ప అలా ఏం ఉండబోదని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఐటెం సాంగ్ ద్వారా సమంత నాగచైతన్యపై రివెంజ్ తీసుకున్నట్లు కనబడుతున్నదని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp