Samantha : పొరపాటున అలా జరిగిందట.. లైట్ తీసుకున్న సమంత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : పొరపాటున అలా జరిగిందట.. లైట్ తీసుకున్న సమంత

 Authored By prabhas | The Telugu News | Updated on :5 July 2022,7:00 pm

Samantha : సమంతకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. జాతీయ స్థాయిలో సమంతకు ఇప్పుడు పాపులారిటీ వచ్చింది. ఊ అంటావా అనే పాటు అంతర్జాతీయంగా ఫేమస్ అయింది. ఎవ్వరి నోట చూసినా ఇదే పాట వినిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి స్టార్ సెలెబ్రిటీల వరకు ఆ పాటను పాడేసుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఊ అంటావా? అని అనేశాడు. అలా సమంత పాట ఏ రేంజ్‌కు వెళ్లిందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. అంతర్జాతీయ ఫెస్టివల్లో ఈ పాటను ప్లే చేస్తున్నారు. అలా సమంత క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

సమంతకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఇన్ స్టా, ఎఫ్ బీ, ట్విట్టర్ ఇలా అన్నింట్లోనూ సమంతకు మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఇక ఇన్ స్టాలో అయితే 24 మిలియన్ల మందికి పైగా ఉన్నారు. అలా సమంత సోషల్ మీడియాలో మోస్ట్ ఇంఫ్లూయెన్సర్‌గా మారిపోయింది. ఆమె ఒక్క పోస్ట్ వేస్తే.. ఇన్ స్టాగ్రాం కొన్ని లక్షలు చెల్లించే పరిస్థితి వచ్చింది. అందుకే ఆమె ఇన్ స్టాలో ఇచ్చే యాడ్స్‌తోనే ఎన్నో కోట్లు సంపాదించగలుగుతోందని తెలుస్తోంది. అయితే అలాంటి సమంత ఖాతాలో ఎవరో వేరే ఖాతాకు చెందిన పోస్టులు కనిపించాయి. దీంతో సమంత ఒక్కసారిగా షాక్ అయినట్టుంది.

Samantha Insta post by Seshank Abinesh Due to Technical Issue

Samantha Insta post by Seshank Abinesh Due to Technical Issue

అయితే ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. హ్యాకింగ్ వల్లో లేదంటే ఇంకో సాంకేతిక సమస్యల వల్లో ఇలాంటివి జరగొచ్చు. టెక్నికల్ ఇష్యూ వల్ల తమ పోస్ట్ పొరబాటున సమంత ఖాతాలో షేర్ అయింది అంటూ శశాంక్ అభినేష్ అనే ఫ్యాషన్ డిజైనర్ క్లారిటీ ఇచ్చాడు. దీనిపై సమంత కూడా లైట్ తీసుకున్నట్టుంది. సదరు వ్యక్తి చేసిన పోస్ట్‌ను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది. మొత్తానికి సమంత ఖాతాల మీద మాత్రం అందరి దృష్టి పడుతుందనేది మరోసారి అర్థమైంది. సమంత ప్రస్తుతం ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నట్టుంది. అందుకే ఎక్కువగా ముంబైలో తిరుగుతోంది. ఇక తెలుగులో అయితే యశోద, శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి