Samantha : మళ్లీ ప్రేమలో పడ్డ సమంత.. ఎవరితోనంటే?

Authored By mallesh | The Telugu News | Published on: December 9, 2021, 10:24 am

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. అయితే, విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై పలు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటికి కౌంటర్ కూడా ఇచ్చిన సమంత ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. ప్రజెంట్ బాలీవుడ్ ప్లస్ పాన్ ఇండియా ప్రాజెక్టులపైన సమంత దృష్టి పెట్టోంది.ఇన్ స్టా వేదికగా బ్యూటిఫుల్ ఫొటోతో.. ప్రేమలో పడ్డట్లు పోస్ట్ పెట్టిన నాగచైతన్య ఎక్స్ వైఫ్..డైవోర్స్ తర్వాత సమంత సోషల్ మీడియాలో గతంలో కంటే చాలా యాక్టివ్‌గా ఉంటోంది.

పలు విషయాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోస్ కూడా పంచుకుంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ ఫొటో పెడుతూ దానికి ఇంట్రెస్టింట్ క్యాప్షన్ రాసుకొచ్చింది సమంత. తాను మై‌ఫిట్‌నె‌స్ వారు అందిస్తున్న పీనట్ బట్టర్‌లో లవ్‌లో పడ్డానని తెలిపింది. టేస్ట్ ప్లస్ హెల్దీ పీనట్ బట్టర్ కోసం మై ఫిట్ నెస్ డాట్ ఇన్ వెబ్ సైట్‌లోకి వెళ్లి ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పింది సమంత.సదరు ఫొటోలో సమంత క్యాజువల్ వేర్‌లో కనిపించింది.

samantha interesting post in instagram

samantha interesting post in instagram

Samantha :  మళ్లీ ప్రేమలో పడ్డ

బ్లూ కలర్ టీ షర్ట్, ప్లస్ చాక్లెట్ కలర్‌లో కనిపించింది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ పూర్తి చేసింది. ఇందులో తొలిసారి సమంత పౌరాణిక పాత్ర పోషించింది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’ కూడా పూర్తి చేసింది. తాజాగా ఫిమేల్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’ కూడా అనౌన్స్ చేసింది సమంత. ఈ చిత్రం ద్వారా ఇంట్రెస్టింగ్ స్టోరిని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లు తెలిపింది సమంత.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp