Samantha : సమంత ఒంటరిగా చస్తుందా.. హ్యాపీ అంటున్న ముద్దుగుమ్మ
Samantha : అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత లైఫ్ స్టైల్‌పూర్తిగా మారింది. నచ్చిన సినిమాలు చేయడం, సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు చేయడం వంటివి చేస్తుంది. పలు ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. ఉత్తరాదిన ఆమెకు నానాటికీ ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. అంతేకాదు ఆమె క్రేజ్ ఇండియాను దాటిపోతోంది. ఇండియన్ ఫిమేల్ స్టార్స్ లో సమంత టాప్ పొజిషన్ లో నిలిచింది. ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ఇండియన్ మోస్ట్ పాప్యులర్ హీరోయిన్స్ జాబితాలో సమంత తొలి స్థానంలో నిలవగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రెండో స్థానానికి పరిమితమయింది.
తర్వాతి స్థానాల్లో నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకుణే, రష్మిక మందన్న, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్, పూజా హెగ్డే ఉన్నారని సదరు సంస్థ వెల్లడించింది.తాజాగా ఓ నెటిజన్ సమంతను ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్ చేశారు. తన రెండు పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోను ఉద్దేశిస్తూ.. ఈమె ఇలాగే పిల్లులు, కుక్కలతో జీవితాంతం ఒంటరిగా చస్తుంది.. అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్ కి మరొకరైతే ఘాటు సమాధానం చెప్తారు. కానీ సమంత చాలా పాజిటివ్ గా తీసుకుంది. నిజంగా అదే జరిగితే చాలా సంతోషం అంటూ సమాధానం ఇచ్చింది. మనుషులతో రిలేషన్స్ పెట్టుకోవడం కంటే సంతోషంగా తన పెట్ యానిమల్స్ లో గడుపుతూ జీవితం ముగించడమే ఆనందం అన్నట్లు సమంత రెండు పదాల్లో తెలియజేశారు.

samantha intresting tweet viral
Samantha : సమంతపై తిట్ల వర్షం
ఆ కామెంట్ చేసిన నెటిజెన్ ని సమంత ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు. అతడు తన కామెంట్ ని డిలీట్ చేయడం విశేషం. 2021 లో నాగ చైతన్యతో విడిపోయిన సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు చాలా కాలంగా యష్ అనే పెట్ డాగ్ ఉంది. ఈ మధ్య మరో కుక్కను కొన్నారు. ఏమాత్రం విరామం దొరికినా సమంత వీటితో సమయం గడుపుతారు. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి మూవీ చిత్రీకరణ మొదలైంది. మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో షూట్ చేశారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. యశోద షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.