Samantha : తన కెరీర్‌పై సమంత సంచలన నిర్ణయం.. దసరా రోజు కీలక ప్రకటన..?

Authored By mallesh | The Telugu News | Published on: October 14, 2021, 3:43 pm

Samantha : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సమంత అగ్రకథనాయికగా కొనసాగుతూ వస్తోంది. కెరీర్ మంచి రైజింగ్‌లో ఉన్న టైంలో అనుకోని బ్రేక్. సామ్ చై విడిపోతున్నారని రూమర్లు చక్కర్లు కొట్టడం అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో అందరూ ఒక్కసారిగా సామ్ పై విమర్శల వర్షం కురిపించారు. అయితే, విడాకుల గురించి వస్తున్న పుకార్లను ఖండించాల్సిన క్యూటెస్ట్ కపుల్.. అవును.. మేము నిజంగానే విడిపోతున్నామంటూ అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు.

మేం రిలేషన్ నుంచి విడిపోతున్నాం.. కానీ, భవిష్యత్‌లో మంచి స్నేహితులుగా కొనసాగుతామంటూ సోషల్ మీడియాలో సామ్ చై పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి వివాహం సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ అండ్ క్యూటెస్ట్ కపుల్ వీరిదే అవుతుందని ఎంతో మంది ఆశించారు. కానీ, పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరూ ఇలా విడాకుల బాట పడతారని ఎవరూ ఊహించలేదు. దీనంతటికీ సమంతనే కారణమని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్న సమయంలో ఆమె అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

samantha Key decision on her life

samantha Key decision on her life

Samantha : విడిపోయినా ఫ్రెండ్స్‌గా కలిసే ఉంటాం..

ఇకపోతే పెళ్లి బంధం బ్రేక్ అయిన బాధ నుంచి బయట పడేందుకు సామ్ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నట్టు తెలిసింది. గత మెమోరీస్ గురించి ఆలోచించేంత టైం కూడా లేకుండా బిజీ సమయాన్ని గడపాలని ప్లాన్ చేసుకుందట. ఇటీవల తెలుగులో ఒక సినిమాను, హిందీలో ఒక మూవీని ఒకే చేసిన సామ్.. తాజాగా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లో ఓ మూవీ చేస్తోంది. అయితే, దసరా పండుగ రోజు అనగా అక్టోబర్‌- 15న సామ్ తన కెరీర్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తోంది.

samantha Key decision on her life

samantha Key decision on her life

ప్రస్తుతం సామ్ ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే తమిళ మూవీ చేస్తోంది. అందులో నయన్ తార, సామ్ కలసి యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రాన్ని సామ్ ఇటీవలే కంప్లీట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పార్ట్‌ పూర్తి అయినట్టు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి.

mallesh

No bio available for this author.

Tags :
    1. "Karthika Pournami 365 Vattula : కార్తీక పౌర్ణమి 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు?.. ఏ సమయంలో వెలిగిస్తే మంచిదంటే?"

    2. "Jagadish Reddy : తెలంగాణ నీటి హక్కుల కోసం వెళ్తే అరెస్టులా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్!"

    3. "Ration Card : బిగ్ న్యూస్‌.. వీరి రేషన్ కార్డులపై వేటు? కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కేంద్రం..!"

    4. "India A vs Pakistan A : పాక్ చేతిలో భారత్ ఓటమి.. అభిషేక్ 70, టిలక్ 100.. అయినా ఫ్యాన్స్ ఫైర్..!"

    5. "Puvvada Ajay Kumar : ఖమ్మంలో 800 ఇళ్లు కూల్చి 300 ఇళ్లు కట్టిస్తామంటారా?.. రేవంత్‌పై పువ్వాడ ఫైర్..!"

    6. "Odisha Viral News : బ్యాంకుకు అక్క అస్తిపంజరం మోసుకుని 3.5 కిలోమీటర్లు నడిచాడు.. చివరకు లక్షాధికారిగా మారిన తమ్ముడు!"

    7. "Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp