Samantha : సమంత అబద్దాలనే నమ్ముతుంది ..సంచలన కామెంట్స్
Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మడు చేసే అందాల రచ్చమాములుగా ఉండదు. ఓ వైపు సినిమాలే చేస్తూనే ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సామ్.నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ జీవితంపై కూడా ఫోకస్ పెట్టింది. తన స్నేహితులతో కలిసి విహార యాత్రలకు, ట్రెక్కింగ్స్‌కు వెళుతుంది. అంతే కాదండోయ్ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటోంది. తన మనసులో భావాలను బయట పెట్టేలా కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ వస్తుంది ఈ చెన్నై బ్యూటీ.
కొన్ని సందర్భాల్లో సమంత తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన కామెంట్స్ ఆమె ఎవరినో టార్గెట్ చేస్తున్నాయనే భావన కూడా నెటిజన్స్‌లో తీసుకు వచ్చిందనే చెప్పాలి. అందుకు తాజాగా సమంత పోస్ట్ చేసిన మరో కామెంట్ కూడా ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇంతకీ సమంత సదరు కామెంట్‌లో ఏం చెప్పిందో తెలుసా! ‘‘నిజాలు అరుదుగా బయటకు వస్తాయి. కానీ సమాజం అబద్దాలనే ఎక్కువగా నమ్ముతుంది. అలాంటి అబద్దాలే ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి’’ అని సామ్ పేర్కొంది. ఈ కామెంట్ చూసిన వారు సమంత జీవితంలో అబద్దాల కారణంగా దెబ్బతినడంతోనే అలాంటి కామెంట్స్ చేస్తుందని అంటున్నారు. సమంత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

samantha latest comments on lis goes viral
Samantha : సామ్ రచ్చ….
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత చేస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. అందులో ముందుగా ‘యశోద’ అనే థ్రిల్లర్ ఆగస్ట్ 12న రిలీజ్ అవుతుంది. ఇక మరో పాన్ ఇండియా మూవీ గుణ శేఖర్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరో వైపు జాన్ పిలిప్ దర్శకత్వంలో ‘అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్’ అనే ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి రెడీ అవుతోంది సమంత. ఈ అమ్మడు రానున్న రోజులలో మంచి సినిమాలతో అలరిస్తానంటుంది.

samantha latest comments on lis goes viral