Samantha : రెచ్చిపోయిన సమంత.. విడాకుల తర్వాత అందాల ఆరబోతలో హద్దుల్లేవ్
సమంత చేస్తోన్న పనులను ఎవ్వరూ అంచనా వేయలేకపోతోన్నారు. అసలు నాగ చైతన్య నుంచి ఎందుకు విడిపోయింది.. విడాకులు ఎందుకు తీసుకుంది.. జరిగిన గొడవలు ఏంటి? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పదేళ్ల స్నేహం, ప్రేమ ఇలా అన్నీ కూడా మాయమైపోయాయి. ఇప్పుడు నాగ చైతన్య వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. చివరకు కుక్క బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. కానీ మాజీ భర్త చైతూకి కనీసం విషెస్ చెప్పలేదు.
అలా సమంత, చైతూ మధ్య ఉన్న రాగద్వేషాలు మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే సమంత మాత్రం ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ మీదే దృష్టి పెట్టేసింది. ఉత్తరాదిన పాగా వేయాలని ప్లాన్ వేసినట్టుంది. అందుకే దానికి తగ్గట్టుగా అందాలను ఆరబోస్తోంది. ఇప్పుడు సమంత ఏకంగా హాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత దుమ్ములేపేసింది.

samantha latest photoshoot for elle india
Samantha సమంత అందాల విందు..
అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌తో సమంత ఓ బై తమిళ అమ్మాయిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా సమంత తన అందాలను ఆరబోసింది. వరుస ఫోటో షూట్లతో హంగామా చేస్తోంది. ఎల్లె ఇండియా అనే మ్యాగజిన్ కోసం సమంత చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హద్దుల్లేవ్ అన్నట్టుగా అన్నింటిని చూపించేస్తోంది.