Home » Entertainment » Samantha Making The Same Mistake Again
Entertainment

Samantha : మళ్లీ అదే తప్పు చేస్తున్న సమంత మండిపడుతున్న ఫ్యాన్స్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 27, 2023 11:13 am
Advertisement

Samantha : గత ఏడాది అక్టోబర్ నెలలో మంచానికి పరిమితమైన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తూ ఉంది. మేటర్ లోకి వెళ్తే మయోసైటీస్ అని అరుదైన వ్యాధికి గురైన సమంత… దాదాపు కొన్ని నెలలపాటు వివిధ రకాల చికిత్సలు తీసుకోవడం జరిగింది. దీంతో సమంత అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. అయితే ఈ వ్యాధికి సమంత గురి కావటానికి ప్రధాన కారణం అతిగా వర్కౌట్స్ చేయడమే అని డాక్టర్లు సైతం అప్పట్లో చెప్పినట్లు ప్రచారం జరిగింది.

Advertisement

దీంతో వ్యాధి తగ్గించుకునేందుకు చాలా కఠినంగా… నిష్టగా ఉన్న సమంత ఇటీవల మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేస్తూ… వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఓ ఐలాండ్ లో బీచ్ వద్ద సెలయేర్ల వద్ద యోగ ఆసనాలు వేయటం…స్త్రచింగ్ ఎక్సెర్ సైజ్ లు చేయటం ఆ వీడియోలలో కనిపించడం జరిగింది. దీంతో సమంతా పై అభిమానులు మండిపడుతున్నారు. గతంలో వైద్యులు వర్క్ అవుట్ లు చేయొద్దు అని చెప్పారు. నీకు వచ్చిన వ్యాధికి కారణం అదే అని కూడా హెచ్చరించారు.

Samantha making the same mistake again

Advertisement

అయినా కానీ మళ్ళీ అదే తప్పు చేయటం ఇది నిజంగా అభిమానులను బాధపరచడమే. నిన్ను నీవు.. అనారోగ్యానికి గురి చేసుకోవడమే అంటూ సమంతపై సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగవుతున్న సమయంలో.. ఈ రీతిగా వర్క్ అవుట్ లు చేయటం మళ్ళీ వ్యాధిని రేకెత్తించినట్టు అవుతుంది అని అభిమానులు సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. మరీ సమంత అభిమానుల బాధని అర్థం చేసుకుని వర్క్ ఔట్ లు ఆపుతుందో లేదో చూడాలి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి