Samantha : హీరోయిన్ సమంత తీసుకుంటున్నా నిర్ణయాలు ఆమె అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరం కావాలని.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆమె డిసైడ్ కావటం తెలిసిందే. దీంతో ఒప్పుకున్న ఖుషి.. మరొక బాలీవుడ్ ప్రాజెక్టులను మాత్రమే కంప్లీట్ చేయటంపై దృష్టి పెట్టింది. ఈ రెండు తప్ప మిగతా ప్రాజెక్టులను సమంత ఓకే చేయలేదు. గత ఏడాది మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత.. దాదాపు ఆరు నెలలు హాస్పిటల్ పాలు కావటం తెలిసిందే. ఆ సమయంలో షూటింగ్లకు దూరమైంది.
ఈ క్రమంలో ఈసారి మరో ఏడాది గ్యాప్ సామ్ తీసుకోవటం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహం చెందుతున్నారు. ఇదిలా ఉంటే మళ్ళీ ఇప్పుడు సమంత మాజీ భర్త చైతన్య గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2021లో నాగచైతన్యకి సమంత విడాకులు ఇవ్వడం తెలిసిందే. వీరిద్దరు విడిపోవడం చాలామందికి బాధని కలిగించింది. సమంత పరిస్థితి మాదిరిగానే ఇప్పుడు నాగచైతన్య పరిస్థితి కూడా ఉన్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య నటించిన దాదాపు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఒక్క “బంగారు రాజు” మినహా.. నాగచైతన్య మరో హిట్ అందుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితులలో చైతు కూడా ఏడాది రెస్ట్ తీసుకోవాలని సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ లెక్కన చూస్తే ఈ మాజీ భార్యాభర్తల పరిస్థితి దాదాపు ఒకేలా ఉందని అర్థమవుతుంది. విడాకుల తర్వాత వీళ్ళు కష్టాల గూటికి చేరినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
This website uses cookies.